Srikanth Addala : షూటింగ్‌కి సడెన్‌గా నటుడు రాకపోవడంతో విలన్‌గా మారిన దర్శకుడు..
శ్రీకాంత్ అడ్డాల సినిమాని పూర్తి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడని తెలుస్తుంది. అయితే సినిమాలో విలన్ గా శ్రీకాంత్ అడ్డాల కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
![Srikanth Addala : షూటింగ్‌కి సడెన్‌గా నటుడు రాకపోవడంతో విలన్‌గా మారిన దర్శకుడు.. Srikanth Addala : షూటింగ్‌కి సడెన్‌గా నటుడు రాకపోవడంతో విలన్‌గా మారిన దర్శకుడు..](https://10tv.in/wp-content/uploads/2023/09/srikanth-addala.jpg)
Srikanth Addala acting as villain role in Peddha Kapu Movie
Srikanth Addala : ఇన్నాళ్లు కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం.. లాంటి క్లాస్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల నారప్ప(Narappa) నుంచి తన పంథాని మార్చి ఊర మాస్ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ‘పెద కాపు’(Peddha Kapu) అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకులను మరోసారి థ్రిల్ కి గురి చేయనున్నాడు. కొత్త కుర్రాడు విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ గ్రామాల్లో జరిగే పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పెద కాపు సినిమాలో పార్ట్ 1 సెప్టెంబర్ 29న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల సినిమాని పూర్తి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడని తెలుస్తుంది. అయితే సినిమాలో విలన్ గా శ్రీకాంత్ అడ్డాల కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీని గురించి శ్రీకాంత్ అడ్డాల స్పందించాడు.
Bigg Boss 7 Day 8 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? ప్రశాంత్ కి కౌంటర్ల మీద కౌంటర్లు..
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర కోసం మొదట శౌబిన్ షహీర్ ని తీసుకున్నాము. ఆయన కూడా ఓకే అన్నారు. కానీ షూటింగ్ సమయానికి ఆయన రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. కారణం ఏంటో తెలీదు. అప్పటికే షూటింగ్ కి అంతా మొదలైంది. షూటింగ్ క్యాన్సిల్ చేయలేము. అప్పటికప్పుడు విలన్ గా చేసే ఆర్టిస్టులు దొరకరు. ఏం చేయాలో తెలియని సమయంలో నా అసోసియేట్ డైరెక్టర్ కిషోర్ నన్నే ఈ క్యారెక్టర్ చేయమని ఒప్పించాడు. దీంతో నేనే ఆ పాత్ర చేయాల్సి వచ్చింది. అంతే కానీ దానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు అని తెలిపాడు. గతంలో శ్రీకాంత్ ఆర్య సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో మెరిపించాడు. డైరెక్టర్ గా మెప్పించిన శ్రీకాంత్ నటుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.