Roshan : శ్రీకాంత్ తనయుడికి షూటింగ్ లో తీవ్ర గాయాలు.. మూడు నెలలు బ్రేక్..
ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. (Roshan)
Roshan
Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD సినిమాలతో మెప్పించాడు. పెళ్ళిసందD తర్వాత ఏకంగా మూడు ఏళ్లపైనే గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు.(Roshan)
నిజాం కాలంలో కథతో ఫుట్ బాల్ స్పోర్ట్ కూడా జత చేసి పీరియాడిక్ సినిమాగా తెరకెక్కింది ఛాంపియన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోషన్ నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
Also See : Sara Arjun : జస్ట్ 20 ఏళ్లకే బాలీవుడ్ ని ఊపేసింది.. సూపర్ హిట్ ‘ధురంధర్’ హీరోయిన్ ఫొటోలు..
ఈ క్రమంలో రోషన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వంద రోజుల పాటు షూటింగ్ చేసాము. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి ఈ సినిమాలో. అందుకు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాను. యాక్షన్ సన్నివేశాల్లో నేను బాగా గాయపడ్డాను. లిగ్మెంట్ క్రాక్ అయింది, మణికట్టు దగ్గర కూడా గాయం అయింది, కాలికి కూడా గాయాలు అయ్యాయి. నా గాయాల వల్ల షూటింగ్ కి మూడు నెలలు బ్రేక్ వచ్చింది. ఆ గాయాల నుంచి కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది. యాక్షన్ సన్నివేశాల్లో దెబ్బలు తగలడం సహజమే. నాన్న కూడా చాలా సినిమాల్లో గాయపడ్డారు అని తెలిపాడు.
కెరీర్ ఆరంభంలోనే ఇలా గాయాలు అయ్యేలా యాక్షన్ సీన్స్ కోసం కష్టపడిన రోషన్ ని అభినందిస్తున్నారు.
Also See : Maa Vande Movie : నరేంద్రమోదీ బయోపిక్ ‘మా వందే’ సినిమా ఓపెనింగ్.. మోదీ పాత్రలో మలయాళం స్టార్..
