Maathru Movie Song : హీరో శ్రీరామ్ మదర్ సెంటిమెంట్ సాంగ్ చూశారా..? మాతృ సినిమా నుంచి..

ఇప్పటికే మాతృ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Maathru Movie Song : హీరో శ్రీరామ్ మదర్ సెంటిమెంట్ సాంగ్ చూశారా..? మాతృ సినిమా నుంచి..

Sriram Maathru Movie Mother Sentiment emotional Song Watch Here

Updated On : February 21, 2025 / 8:33 PM IST

Maathru Movie Song : మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు మదర్ సెంటిమెంట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు అదే మదర్ సెంటిమెంట్‌తో మరో సినిమా రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మాణంలో జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Also Read : Seethamma Vakitlo Sirimalle Chettu : సూపర్ హిట్ మల్టీస్టారర్.. క్లాసిక్ సినిమా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

ఇప్పటికే మాతృ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ..’ అంటూ సాగింది ఈ పాట. ఈ పాటను బి.శివ ప్రసాద్ రాయగా శేఖర్ చంద్ర బాణీ సంగీత దర్శకత్వంలో దినేశ్ రుద్ర పాడారు. మీరు కూడా వినేయండి ఈ అమ్మ సెంటిమెంట్ సాంగ్ ని..

ఇప్పటికే ఈ ఎమోషనల్ సాంగ్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని మూవీ యూనిట్ తెలిపారు. మరి ఈ మదర్ సెంటిమెంట్ మాతృ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.