Sriya Reddy : పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, OG సినిమాపై కామెంట్స్ చేసిన శ్రియ రెడ్డి.. ఆయన సీఎం అయితే..

తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తోంది శ్రియారెడ్డి. OG సినిమా షూట్ లో ఇటీవలే జాయిన్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

Sriya Reddy : పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, OG సినిమాపై కామెంట్స్ చేసిన శ్రియ రెడ్డి.. ఆయన సీఎం అయితే..

Sriya Reddy comments on Pawan Kalyan Politics and OG Movie

Updated On : June 21, 2023 / 9:31 AM IST

Pawan Kalyan :  పొగరు సినిమాలో విలన్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రియారెడ్డి. విశాల్ కి వదిన అవుతుంది శ్రియ. ఆ తర్వాత కొన్ని తమిళ్ సినిమాల్లో నటించిన ఆమె కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తోంది శ్రియారెడ్డి. ప్రభాస్ సలార్, పవన్ కళ్యాణ్ OG సినిమాలలో ముఖ్యపాత్రలు చేస్తోంది శ్రియారెడ్డి.

సలార్ సినిమాలో ఇప్పటికే ఆమె షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా అనుభవాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకొని సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. ఇక OG సినిమా షూట్ లో ఇటీవలే జాయిన్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

శ్రియారెడ్డి OG సినిమా గురించి మాట్లాడుతూ.. సుజిత్ వచ్చి కథ చెప్తా అన్నప్పుడు కమర్షియల్ సినిమా అయి ఉంటింది, కథ విని నో చెపుదాం అనుకున్నాను. కానీ కథ విన్నాక మొదటి 10 నిమిషాలకే నాకు బాగా నచ్చింది. అందుకే OG సినిమాకి ఓకే చెప్పాను. పవన్ గారిని సెట్ లో మొదటి రోజు చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను. పవన్ గారు చాలా అందంగా ఉంటారు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. అలా షేక్ హ్యాండ్ ఉంచేశాను. చాలా హంబుల్ గా ఉంటారు. సినిమా మాత్రం అదిరిపోతుంది అని తెలిపింది.

Manoj Muntashir : హనుమంతుడు దేవుడు కాదు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆదిపురుష్ రచయిత మనోజ్..

ఇక పవన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. నేను ఏపీ పాలిటిక్స్ కూడా ఫాలో అవుతాను. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు బాగుంటాయి, ఫుల్ మాస్ గా, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. బయట ఆ రేంజ్ లో మాట్లాడే పవన్ కళ్యాణ్ సెట్ లో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటారు. ఏపీ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడాను. పవన్ గారు సీఎం అవుతారా లేదా నేను చెప్పను కానీ అయితే మాత్రం ఆయనది చాలా మంచి మనుసు. ఆయన ప్రజలకు బాగా కనెక్ట్ అవుతారు అని తెలిపింది. దీంతో శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.