Manoj Muntashir : హనుమంతుడు దేవుడు కాదు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆదిపురుష్ రచయిత మనోజ్..

రైటర్ మనోజ్ ముంతషీర్ అయితే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Manoj Muntashir : హనుమంతుడు దేవుడు కాదు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆదిపురుష్ రచయిత మనోజ్..

Adipurush Writer Manoj Muntashir sensational comments on Lord Hanuman

Updated On : June 21, 2023 / 8:51 AM IST

Adipurush :  ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలమయంగా మారిన సంగతి తెలిసిందే. ముందు నుంచి రామాయణం(Ramayanam) అని ప్రమోట్ చేసి, సినిమాలో రామాయణం ఛాయలు లేకపోవడం, ట్రోల్స్ రావడంతో అసలు ఇది రామాయణం కాదని చెప్పడం, సినిమాలో వాడిన డైలాగ్స్ తో వివాదం, పలు చోట్ల సినిమాని బ్యాన్ చేయడం, సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు.. ఇలా మొత్తంగా ఆదిపురుష్ సినిమా వివాదంలో నిలిచింది.

ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, రచయిత మనోజ్ పై విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఇక రైటర్ మనోజ్ ముంతషీర్ అయితే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నాడు. ఇటీవల తాను రాసిన డైలాగ్స్ సమర్ధించుకుంటూ మాట్లాడాడు, నేనేమి తప్పు రాయలేదన్నాడు, ఇక సినిమా అసలు రామాయణమే కాదు అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ సినిమాలో డైలాగ్స్ మీ కోసం మారుస్తున్నాం అన్నాడు. ఇలా రోజుకొక వ్యాఖ్యలతో మనోజ్ ముంతషీర్ వార్తల్లో నిలుస్తున్నాడు.

Prabhas : ప్రభాస్ ముందే చెప్పినా ఓం రౌత్ వినలేదా? ఆదిపురుష్ పై ప్రభాస్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మనోజ్ మాట్లాడుతూ.. హనుమంతుడు దేవుడు కాదు. ఆయన ఓ భక్తుడు. ఆయన భక్తికి ఉన్న శక్తి వల్ల మనం హనుమంతుడిని దేవుడ్ని చేశాము అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు, హనుమంతుడి భక్తులు మనోజ్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇక పలువురు నెటిజన్లు అయితే మనోజ్ పై ట్రోల్స్ చేస్తున్నారు.