Baahubali 3: బాహుబలి పార్ట్-3 కూడా రాబోతుందా? 

నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి సుముఖంగా ఉన్నారన్నారు రాజమౌళి.

Baahubali 3: బాహుబలి పార్ట్-3 కూడా రాబోతుందా? 

Rajamouli

Updated On : October 17, 2024 / 9:43 PM IST

బాహుబలి.. ఈ సినిమాతో టాలీవుడ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి పార్ట్‌-1 బాక్సాఫీసు దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాహుబలి-2 రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వగా, రాజమౌళి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అయితే బాహుబలి పార్ట్-3 కూడా రాబోతుందట.

ఇక ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తుంటే, రాజమౌళి RRR తర్వాత మహేశ్ బాబుతో మూవీ చేయబోతున్నాడు. ఇది పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు. అయితే మహేశ్‌ బాబుతో మూవీ కంప్లీట్ అవ్వగానే కాస్త రెస్ట్ తీసుకుని రాజమౌళి బహుబలి పార్ట్-3 స్టార్ట్ చేస్తాడంటున్నారు. ఇటీవల నిర్మాత కేఈ జ్ఞానవేల్ కంగువా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బహుబలి-3పై చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి.

ఇప్పుడు ఇది ఫుల్ వైరల్ అవుతుండగా..గతంలో RRR మూవీ ప్రమోషన్స్‌లో రాజమౌళి కూడా బాహుబలి-3 ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు అంటూ హింట్‌ ఇచ్చాడు. బాహుబలి చుట్టూ జరిగే ఇతర ఎన్నో సంఘటనలను ఈసారి మీకు చూపించనున్నామని..దానిపై వర్క్ చేస్తున్నామని చెప్పాడు.

నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి సుముఖంగా ఉన్నారన్నారు రాజమౌళి. ఇప్పుడే రాకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త మాత్రం తప్పక వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బహుబలి-3 కూడా రాబోతుందని కాకపోతే కాస్త టైమ్ మాత్రం పట్టొచ్చంటున్నారు.

Love Reddy : ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆసక్తికర టైటిల్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీ..