బాహుబలి కంటే సైరాలోనే ఎక్కువ.. తెలుగు ప్రజలకు చరణ్ గిఫ్ట్ ఇది: రాజమౌళి

  • Published By: vamsi ,Published On : September 23, 2019 / 02:04 AM IST
బాహుబలి కంటే సైరాలోనే ఎక్కువ.. తెలుగు ప్రజలకు చరణ్ గిఫ్ట్ ఇది: రాజమౌళి

Updated On : September 23, 2019 / 2:04 AM IST

వీఎఫ్ఎక్స్ మాయాజాలం తెలుగు తెరపై అధ్భుతంగా తీసుకుని వచ్చింది ఎవరంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రాజమౌళి అని, మ‌గ‌ధీర‌ సినిమాతో చ‌ర‌ణ్ కెరీర్‌కి బాట‌లు వేసిన రాజ‌మౌళి ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ వీఎఫ్ఎక్స్ వాడారు. తరువాత ఆయన సృష్టించిన బాహుబలిలో వీఎఫ్ఎక్స్ పీక్స్.. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు బాహుబలి అందుకుంది అంటే అందుకు కారణం వీఎఫ్ఎక్స్.

లేటెస్ట్ గా సైరా ప్రీరిలీజ్ వేడుకలో ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి కంటే సైరాలోనే వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. 3వేల 8వందల వీఎఫ్ఎక్స్ షాట్స్ సినిమాలో ఉన్నట్లు కనల్ కణ్ణన్ తనతో చెప్పారని రాజమౌళి అన్నారు. ఇక సైరా గురించి మాట్లాడే ముందు ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్ కి అని చెప్పారు. వాళ్ళ గుండెల్లో ఈ కథని 20 ఏళ్ల పాటు మోశారని అన్నారు.

అలాగే ఈ సినిమాతో రామ్ చరణ్ చిరంజీవికి మాత్రమే గిఫ్ట్ ఇవ్వట్లేదు అని తెలుగు ప్రజలకు గిఫ్ట్ ఇస్తున్నాడు అని రాజమౌళి అన్నారు. ఇదే సమయంలో ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం ఎంత కష్టమో నాకు తెలుసునని, సురేందర్ రెడ్డిగారు సైరా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు. ‘బాహుబలి’ లో 2300 వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌లు ఉంటే ‘సైరా’ లో 3800 షాట్స్‌ ఉన్నాయని, అన్ని షాట్స్‌ మధ్యలో ఎమోషన్స్‌ని వదలకుండా, మరచిపోకుండా చేశారని అభినందించారు.