Sri Ramakrishna : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ రచయిత కన్నుమూత..
ఇటీవలే కొన్ని రోజుల క్రితమే తమిళ్ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ మృతిచెందగా నిన్న రాత్రి సీనియర్ స్టార్ రచయిత శ్రీ రామకృష్ణ మరణించారు.

Star Dialogue Writer Sri Ramakrishna Passed Away
Sri Ramakrishna : తాజాగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇటీవలే కొన్ని రోజుల క్రితమే తమిళ్ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ మృతిచెందగా నిన్న రాత్రి సీనియర్ స్టార్ రచయిత శ్రీ రామకృష్ణ మరణించారు. తమిళ్ సినిమాలకు, తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయిన చాలా సినిమాలకు శ్రీ రామకృష్ణ మాటల రచయితగా వ్యవహరించారు. బాంబే, జెంటిల్మన్, అపరిచితుడు, ఒకేఒక్కడు, చంద్రముఖి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నిటికీ తెలుగులో డబ్బింగ్ కి డైలాగ్స్ ఈయనే రాశారు. దాదాపు 300 పైగా సినిమాలకు శ్రీ రామకృష్ణ పనిచేసారు. చివరగా రజినీకాంత్ దర్బార్ సినిమాకు తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ రాసారు.
గత కొంతకాలంగా శ్రీ రామకృష్ణ వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నిన్న ఏప్రిల్ 1 రాత్రి మరణించారు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు.
Also Read : Vijay Deverakonda : నాన్న కోసం విజయ్ దేవరకొండ ఏం చేసాడో తెలుసా? ఏకంగా సినిమాలో..
74 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో శ్రీ రామకృష్ణ మరణించారు. ఆయన రచయితగానే కాక పలు సినిమాలకు డైరెక్షన్ కూడా చేసారు. నేడు చెన్నై సాలిగ్రామంలోని స్మశాన వాటికలో శ్రీ రామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు తెలిపారు.
Dubbing dialogue writer Sri Ramakrishna (74) garu are no more. He penned dialogues for many of Mani Ratnam and Shankar films in their prime time.
Om Shanthi ?
అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ(74) కన్నుమూత. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో రాత్రి 8 గంటలకు… pic.twitter.com/DpgpsWmSq3
— idlebrain.com (@idlebraindotcom) April 1, 2024