కొరటాల శివ చిరు కొత్త ప్రాజెక్ట్ రెడీ!

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 01:10 PM IST
కొరటాల శివ చిరు కొత్త ప్రాజెక్ట్ రెడీ!

Updated On : April 4, 2019 / 1:10 PM IST

డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. చిరు కోసం కొరటాల ఓ సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. 

ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ ‘ సైరా నర్సింహా రెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు ఖైదీ నెంబర్ 150తో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి నిర్మాతగా మారాడు. 

టాలీవుడ్ మెగాస్టార్‌తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగ్గూభాయ్ జగపతి బాబు, నయనతార, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఎందరో నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.