Movie Shootings : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ??

ప్రస్తుతం ఏ ఏ హీరో ఏ సినిమాలతో ఎక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్నారో తెలుసా??...............

Movie Shootings : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ??

Movie Shootings

Updated On : May 24, 2022 / 10:16 AM IST

Movie Shootings :  ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో హీరోలంతా మరింత స్పీడ్ గా సినిమాలు అనౌన్స్ చేస్తూ వరుస షూటింగ్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఏ ఏ హీరో ఏ సినిమాలతో ఎక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్నారో తెలుసా??

Priyanak jawalkar : మిర్చి కంటే ఘాటుగా ఎరుపు డ్రెస్‌లో మత్తెక్కించే చూపులతో ప్రియాంక జవాల్కర్

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా అన్నపూర్ణ 7ఎకరాస్ లో షూటింగ్ జరుగుతుంది.

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సార్’ సినిమా ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో షూటింగ్ జరుగుతుంది.

రవితేజ పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.

నాని హీరోగా తెరకెక్కుతున్న మాస్ సినిమా ‘దసరా’ షూటింగ్ బాచుపల్లిలో జరుగుతుంది.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘సభకు నమస్కారం’ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లిలో జరుగుతుంది.

నితిన్, కృతిశెట్టి జంటగా రాబోతున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

సమంత, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా ఇటీవలే కశ్మీర్లో షూటింగ్ పూర్తి చేసుకుంది.