Movie Shootings : మెగాస్టార్ నుంచి నాని వరకు.. ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.

Star Heros Movie Shootings In Different Places
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ తమ కొత్త సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో యమా స్పీడ్‌గా జరుగుతోంది. అటు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియో లో జరుగుతుంది
ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందంటే..?
– వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నవిశ్వంభర మూవీ షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.
Nargis Fakhri sister : ప్రముఖ నటి సోదరి అరెస్ట్.. ప్రియుడు ఉన్న ఇంటికి నిప్పు అంటించి..
– ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియో లో జరుగుతుంది.
– ప్రభాస్ జాను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
– బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా షూటింగ్ చౌటుప్పల్ లో జరుగుతుంది.
– నాగార్జున ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్ నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియో లో జరుగుతోంది.
Pushpa 2 : ‘పుష్ప మూవీకి అసలు ప్రమోషన్ అవసరం లేదు’.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
– వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైనికపురి లో జరుగుతుంది.
– రవితేజ భాను బొగ్గవరపు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.
– నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 మూవీ షూటింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది.
– భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభూ. ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
– సిద్దు జొన్నలగడ్డ కోన నీరజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ పుణె లో జరుగుతుంది.
– తేజ సజ్జ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటిస్తున్న మిరాయ్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.