Sudheer Babu: చంద్రబాబు ఇలాఖాలో సుధీర్ బాబు కొత్త సినిమా..

నైట్రో స్టార్ సుధీర్ బాబు.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్, పుల్లేటి గోపీచంద్ బయోపిక్ తో పాటు, 'హంట్' అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మరో చిత్రానికి సైన్ చేశాడు ఈ హారో. ఈ సినిమా కథాంశం మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం "కుప్పం" చుట్టూ తిరగనుంది.

Sudheer Babu: చంద్రబాబు ఇలాఖాలో సుధీర్ బాబు కొత్త సినిమా..

Sudheer Babu New Movie in Chandrababu Constitution

Updated On : October 31, 2022 / 12:22 PM IST

Sudheer Babu: నైట్రో స్టార్ సుధీర్ బాబు.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్, పుల్లేటి గోపీచంద్ బయోపిక్ తో పాటు, ‘హంట్’ అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మరో చిత్రానికి సైన్ చేశాడు ఈ హారో. ఈ సినిమా కథాంశం మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం “కుప్పం” చుట్టూ తిరగనుంది.

Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు సినిమా “హంట్” టైటిల్ పై వివాదం..

ఈ చిత్రం గురించి ప్రకటిస్తూ మూవీ టీం ఇవాళ.. సినిమా కాన్సెప్ట్ ని తెలుపుతూ టైటిల్ టీజర్ ని విడుదల చేసారు. సుధీర్ బాబు ఈ సినిమాలో ‘సుబ్రహ్మణ్యం’ అనే తిరుగుబాటు దారుడు పాత్రలో కనిపించబోతున్నాడు. “సుబ్రహ్మణ్యం ప్రజలు నీకోసం ఎదురు చూస్తున్నారు. అలా నిశ్శబ్దంగా ఉంటే ఎలా, ఏదోకటి చెప్పు” అన్న ప్రశ్నకు హీరో.. “ఇంకా చెప్పేది ఏదిలేదు చేసేదే” అనే డైలాగ్ తో టీజర్ పవర్ ఫుల్ గా ఉంది.

“హరామ్ హర” అనే టైటిల్ తో వస్తున్న సినిమా మొత్తం 1980 కాలం బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్నట్లు తెలుస్తుంది. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్ చూస్తుంటే.. సినిమాలో ప్రతీకార కోణం, అలాగే టీజర్ బట్టి చూస్తే దైవిక అంశాలు కూడా ఉంటాయి అని తెలుస్తుంది. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తుండగా, జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తున్నాడు.