Sudigali Sudheer : ఇద్దరం కలిసి నటించడానికి.. నేను, రష్మి కలిసి కథలు వింటున్నాము..
ఇద్దరం కలిసి నటించడానికి నేను, రష్మి కలిసి కథలు వింటున్నాము అంటూ తెలియజేసిన సుడిగాలి సుధీర్.

Sudigali Sudheer Rashmi Gautam listening stories for do one movie together
Sudigali Sudheer : బుల్లితెరపై సూపర్ స్టార్ ఫేమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం వెండితెర పై మంచి స్టార్‌డమ్ ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు అటు బుల్లితెరలో నటిస్తూనే.. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు బుల్లితెరకు పూర్తి విరామం ఇచ్చేసి.. హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే గోట్, కాలింగ్ సహస్ర తదితర చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. వీటిలో ‘కాలింగ్ సహస్ర’ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా విలేఖర్లతో సమావేశమైన సుధీర్.. రష్మీతో సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో సుధీర్, రష్మీ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ఆకట్టుకున్న ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై కూడా కలిసి కనిపిస్తే చూడాలని చాలామంది అభిమానులు ఆశ పడుతున్నారు. ఇక ఈ విషయం గురించే సుధీర్ ని విలేఖర్లు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రశ్నించారు.
Also read : Chiranjeevi – Charan : 16 ఏళ్ళ క్రిందట చిరు మాటల్ని.. ఇప్పుడు నిజం చేసిన చరణ్..
దీనికి సుధీర్ బదులిస్తూ.. “నేను, రష్మి కలిసి కథలు వింటున్నాము. అయితే మా ఇద్దరికీ నచ్చిన కథ ఇప్పటివరకు మాకు దొరకలేదు. ఒకవేళ ఏదైనా కచ్చితంగా కలిసి నటిస్తాము. ఇద్దరం కలిసి చేయాలనే ఆశ మాకు కూడా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి బుల్లితెర లవ్లీ కపుల్ వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.
ఇక ‘కాలింగ్ సహస్ర’ సినిమా విషయానికి వస్తే.. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎవరో ఒక అమ్మాయి ఉపయోగించిన ఫోన్ నెంబర్ ని డియాక్టివేట్ చేయకుండానే హీరోకి అమ్మడం, దీంతో ఆ అమ్మాయి కథలోకి హీరో ఎంట్రీ ఇవ్వడంతో ఎలాంటి సమస్యలు హీరో ఎదుర్కొన్నాడు అనేది కథ. అరుణ్ విక్కిరాలా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్ గా నటించారు.