Sujeeth Cinematic Universe : ‘సుజీత్ సినిమాటిక్ యూనివర్స్’.. ఓజీ సినిమాకు సాహో సినిమాకు లింక్ ఇదే.. ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ..
నిన్న రాత్రి సుజీత్, DVV సంస్థ సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ఉందని ఇండైరెక్ట్ గా ప్రకటించారు. (Sujeeth Cinematic Universe)

Sujeeth Cinematic Universe
Sujeeth Cinematic Universe : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ముందు రోజే ఆల్మోస్ట్ చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. అమెరికాలో ఇప్పటికే షోలు పడ్డాయి. సినిమా మాత్రం అదిరిపోయింది, ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు. సుజీత్ తమ ఆకలి తీర్చాడంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు కూడా OG సినిమా అదిరిపోయింది అని చెప్తున్నారు.
ముందు నుంచి ఈ సినిమాకు, సాహో సినిమాకు లింక్ ఉందని వార్తలు వచ్చాయి. నిన్న రాత్రి సుజీత్, DVV సంస్థ సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ఉందని ఇండైరెక్ట్ గా ప్రకటించారు. ఓజీ సినిమాలో చూస్తే సాహో సినిమాకు లింక్ ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడటానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ సాహో, ఓజీ సినిమాకు ఉన్న లింక్ ఏంటంటే..
Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..
ఓజీ సినిమాలో విలన్ ఓమి(ఇమ్రాన్ హష్మీ) సాహో లో చూపించిన వాజి సిటీ నుంచే వస్తాడు. సిద్దార్థ్ నందన్(ప్రభాస్) తండ్రి రాయ్(జాకీ ష్రాఫ్)ని ముంబైలోనే చంపడానికి ఓమి కూడా ట్రై చేస్తాడు. ఓజీ సినిమా కూడా ముంబైలోనే జరుగుతుంది. అలా ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్ పాత్రలకు లింక్ ఇచ్చాడు. చిన్నప్పటి ప్రభాస్ పాత్రని ఓజీలో చూపించారు. OG సినిమా 1980, 90ల్లో జరుగుతుంది. సాహో సినిమా 2019 లో జరుగుతుంది. అందుకే ప్రభాస్ చిన్నప్పటి పాత్రని, సాహో తండ్రి కథని చూపించారు. దీంతో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కలిసి ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉండొచ్చు.
అలాగే నెక్స్ట్ సుజీత్ నానితో చేయబోయే సినిమా కూడా వీటికి లింక్ చేసి సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఓజీ సినిమాతో పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్ కూడా హ్యాపీ..
Also Read : OG Record : నార్త్ అమెరికాలో OG సరికొత్త రికార్డ్.. దేవర, పుష్ప 2 రికార్డులు బీట్ చేసి..