Sukumar-Koratala Siva:ఛాలెంజ్ కంప్లీట్ చేసిన సుకుమార్, కొరటాల శివ.. ఎవరెవరిని నామినేట్ చేశారంటే..

:ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెం

Sukumar-Koratala Siva:ఛాలెంజ్ కంప్లీట్ చేసిన సుకుమార్, కొరటాల శివ.. ఎవరెవరిని నామినేట్ చేశారంటే..

Updated On : December 27, 2021 / 11:27 AM IST

Sukumar-Koratala Siva:ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో దర్శకులు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

దర్శకుడు సుకుమార్ కూడా తాజాగా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ఇల్లు తుడిచి, గిన్నెలు కడిగి ఇంటి పనిలో తన భార్యకు సహాయం చేశారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ఈ ఛాలెంజ్ కోసం సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, నిర్మాత దిల్ రాజు, దర్శకులు వంశీపైడిపల్లి, సురేందర్‌రెడ్డి, కొరటాల శివను సుక్కు నామినేట్ చేశారు. అలాగే ఎన్టీఆర్‌, సుకుమార్ నామినేట్ చేసిన వారిలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కూడా ఉన్నారు. ఆయ‌న ఈరోజు ఇంటిప‌నుల్లో భార్య‌కు సాయం చేసి ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా, రాను రాను  అలవాటయ్యి, ఇప్పుడు సరదా అయింది అని తెలుపుతూ..ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కొర‌టాల శివ నామినేట్ చేశారు.