Karthik Varma : విరూపాక్ష డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్, సాయి‌ధరమ్ తేజ్..

తాజాగా విరూపాక్ష సినిమా ఇంతటి భారీ విజయం సాధించినందుకు సుకుమార్, సాయి ధరమ్ తేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఓకాస్ట్‌లీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.

Karthik Varma : విరూపాక్ష డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్, సాయి‌ధరమ్ తేజ్..

Sukumar and sai dharam tej gifted costly Benz car to virupaksha director karthik varma

Virupaksha Director :  ఇటీవల విరూపాక్ష(Virupaksha) సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ కార్తీక్ వర్మ(Director Karthik Varma). సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కి మంచి కంబ్యాక్ సినిమా ఇవ్వడమే కాక ప్రేక్షకులకు అదిరిపోయే సినిమాను ఇచ్చి నిర్మాతలకు కూడా 100 కోట్ల సినిమాను ఇచ్చారు కార్తీక్. ఈ సినిమాని సుకుమార్, BVSN ప్రసాద్ కలిసి నిర్మించారు.

తాజాగా విరూపాక్ష సినిమా ఇంతటి భారీ విజయం సాధించినందుకు సుకుమార్, సాయి ధరమ్ తేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఓకాస్ట్‌లీ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దాదాపు 70 లక్షల విలువ చేసే బెంజ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. కార్ తో పాటు సుకుమార్, తేజ్ కార్ ఇస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేసాడు కార్తీక్.

Naga Shaurya : ఆ రోజు అబ్బాయిది తప్పుకాదు.. అమ్మాయిదే తప్పు.. క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య!

ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. విరూపాక్ష సినిమా నాకు లైఫ్ టైం మెమరీ, నా గురువు సుకుమార్, నా హీరో సాయి ధరమ్ తేజ్, నా నిర్మాతలు BVSN ప్రసాద్ గారికి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని పోస్ట్ చేసాడు. దీంతో పలువురు నెటిజన్లు కార్తీక్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.

View this post on Instagram

A post shared by Karthik Varma Dandu (@karthik_cinema)