7/G Brindavan Colony : 7/G బృందావన కాలనీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన సుమన్ శెట్టి.. ఈ సారి అంతకు మించి..
రవికృష్ణ, అనశ్వర రాజన్ జంటగా 7/G బృందావన కాలనీ సీక్వెల్ తెరకెక్కుతుంది. (7/G Brindavan Colony)
7/G Brindavan Colony
7/G Brindavan Colony : 7/G బృందావన కాలనీ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. బేవర్స్ గా తిరిగే ఓ అబ్బాయి ప్రేమలో పడి మంచివాడిగా ఎలా మారాడు, ఆ అమ్మాయి అనుకోకుండా మరణిస్తే ఏం జరిగింది అని కామెడీ ఎమోషనల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్, తెలుగులో 2004లో రిలీజయి దాదాపు 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
ఈ సినిమాకు, సినిమాలోని సాంగ్స్, ప్రేమకథ, కామెడీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాకు సెల్వరాఘవన్ సీక్వెల్ తీస్తా అని ఎప్పట్నుంచో చెప్తున్నారు. చెప్పినట్టే ఆలస్యం అయినా ఈ సంవత్సరం సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రవికృష్ణ, అనశ్వర రాజన్ జంటగా 7/G బృందావన కాలనీ సీక్వెల్ తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఉన్నవాళ్లు కొంతమంది ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు.
Also Read : Tejaswini Vygha : హ్యాపీ సండే అంటూ.. చీరకట్టులో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన దిల్ రాజు భార్య..
7/G బృందావన కాలనీ సినిమాలో తన కామెడీతో నవ్వించిన సుమన్ శెట్టి పార్ట్ 2లో కూడా నటిస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి 7/G బృందావన కాలనీ సీక్వెల్ పై మాట్లాడుతూ.. బృందావన కాలనీ సీక్వెల్ ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ ని మించి ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్ ఉంటుంది. నాకు కూడా మంచి పాత్ర ఉంది. మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాను అని తెలిపారు.
దీంతో 7/G బృందావన కాలనీ సినిమా ఫ్యాన్స్ ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు. 2026 చివర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం.
Also Read : Deepika Padukone : మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ధురంధర్ వివాదానికి స్వస్తి..
