Suman Shetty: పవన్ కళ్యాణ్ వల్లే ఆ అవకాశం వచ్చింది.. గుర్తుపెట్టుకొని పిలిచి మరీ..

జయం సినిమాలో తన టైపాప్ నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి(Suman Shetty). అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు.

Suman Shetty: పవన్ కళ్యాణ్ వల్లే ఆ అవకాశం వచ్చింది.. గుర్తుపెట్టుకొని పిలిచి మరీ..

Suman Shetty made interesting comments about Pawan Kalyan.

Updated On : December 21, 2025 / 7:02 PM IST

Suman Shetty: జయం సినిమాలో తన టైపాప్ నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి. అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ తరువాత కూడా చాలా సినిమాలో కమెడియన్ గా, సోలో హీరోగా పలు సినిమాలు చేసాడు. కానీ, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. అంతేకాదు, తన అద్భుతమైన నటనతో 14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కోసాగాడు. లాస్ట్ వీక్ ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. కానీ, ఆయన్ని చాలా మంది విన్నర్ అవుతారని భావించారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ‘మగువా.. మగువా’ పాట.. విన్నర్ ఎవరో హింట్ ఇచ్చారా..

ఈ నేపధ్యంలోనే ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “నేను ఇండస్ట్రీలో బాగా ఇష్టపడే వ్యక్తులు పవన్ కళ్యాణ్, తేజ. ఒకరు నాకు జీవితాన్ని ఇచ్చారు. ఇంకొకరు అవకాశాలు లేని రోజుల్లో గుర్తుపెట్టుకొని మరీ ఛాన్స్ ఇచ్చారు. సర్దార్ గబ్బర్ సింగ్ లో ఒక చిన్న పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సుమన్ శెట్టి చేస్తే బాగుంటుంది అని గుర్తుపెట్టుకొని మరీ నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. పాత్ర చిన్నదే కానీ, ఆయన నను గుర్తుపెట్టుకొని పిలిచి మరీ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్” అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి(Suman Shetty).

దీంతో సుమన్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ తరువాత సుమన్ శెట్టి మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో త టైపాప్ పంచులతో రచ్చ చేశాడు సుమన్ శెట్టి. ఆడియన్స్ కి కూడా ఆ పంచులు బాగా నచ్చేశాయి. వాటిని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. కాబట్టి, ఆ క్రేజ్ ను మేకర్స్ ఉపయోగించుకుంటే మంచిదే అనే చెప్పాలి.