Sunil Shetty : కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి ఎమోషనల్ పోస్ట్..

గత కొంతకాలంగా అతియాశెట్టి, ఇండియన్ క్రికెటర్ KL రాహుల్ ప్రేమించుకొని ఇటీవలే ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లిపీటలెక్కారు. వారం రోజుల క్రితమే వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. KL రాహుల్, అతియాశెట్టిల..................

Sunil Shetty : కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి ఎమోషనల్ పోస్ట్..

Sunil Shetty Emotional Post on Daughter Athiya Shetty Marriage

Updated On : January 31, 2023 / 9:23 AM IST

Sunil Shetty :  బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టి కూడా బాలీవుడ్ లో పలు సినిమాల్లో, సిరీస్ లలో హీరోయిన్ గా నటించింది. గత కొంతకాలంగా అతియాశెట్టి, ఇండియన్ క్రికెటర్ KL రాహుల్ ప్రేమించుకొని ఇటీవలే ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లిపీటలెక్కారు. వారం రోజుల క్రితమే వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. KL రాహుల్, అతియాశెట్టిల వివాహానికి పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు విచ్చేశారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Shahrukh Khan : ఎట్టకేలకు బాయ్‌కాట్ పై స్పందించిన షారుఖ్.. సినిమాలని సీరియస్ గా తీసుకోకండి..

తాజాగా నటుడు సునీల్ శెట్టి తన కూతురు పెళ్ళిలో అతియాతో కలిసి డ్యాన్స్ వేస్తున్న ఓ ఫోటోని షేర్ చేసి ఎమోషనల్ అయ్యాడు. తన కూతురితో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోని షేర్ చేసి..నువ్వు పుట్టినప్పటినుంచి నీ వేలితో నా చేతిని పట్టుకొని పెరిగావు ఇప్పుడు నీ పాటలకు డ్యాన్స్ చేస్తున్నావు. లవ్ యు మై బేబీ. నువ్వు ఎప్పుడూ బాగుండాలి అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కి కూతురు అతియా లవ్ సింబల్స్ తో రిప్లై ఇచ్చింది.