సన్నీ లియోన్ డైపర్ మాస్క్ చూశారా!
డైపర్‌తో ఫేస్ మాస్క్ వేసుకున్న సన్నీ లియోన్.. పిక్స్ వైరల్..

డైపర్‌తో ఫేస్ మాస్క్ వేసుకున్న సన్నీ లియోన్.. పిక్స్ వైరల్..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి అయిపోయాయి. అందరి దగ్గరా సరిపడా మాస్కులు లేవనే మాట మాత్రం వాస్తవం. అయితే బాలీవుడ్ భామ సన్నీ లియోన్ సరికొత్త మాస్కు తయారు చేసింది.
ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే సమయంలో మాస్క్ తప్పనిసరి. ఒకవేళ మాస్క్ లేకపోతే అత్యవసర పనిమీద బయటకి వెళ్లాల్సివస్తే కర్చీఫ్, దుపట్టా, స్కార్ఫ్ ఇలా ఏదో ఒకదానితో అడ్జెస్ట్ అవుతాం. అయితే సన్నీ మాత్రం డైపర్లతోనూ మాస్కులు తయారు చేసుకోవచ్చని చెప్పింది.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైపర్లను ముఖానికి ధరించిన పిక్స్ షేర్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో డైపర్‌ను ఇలా ఎమర్జెన్సీ ఫేస్‌మాస్క్‌గా వాడుకోండని సలహా ఇచ్చింది. సన్నీ డైపర్ మాస్క్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైక్స్, కామెంట్స్ కూడా భారీగానే వస్తున్నాయి.