Rajinikanth : అభిమాని ఇంటికి వెళ్లిన రజినీకాంత్.. నిద్ర చెడగొట్టానా అంటూ..

రజినీకాంత్ ఒక అభిమాని ఇంటికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rajinikanth : అభిమాని ఇంటికి వెళ్లిన రజినీకాంత్.. నిద్ర చెడగొట్టానా అంటూ..

Super star Rajinikanth visit his fan home video gone viral

Updated On : November 9, 2023 / 2:04 PM IST

Rajinikanth : జైలర్ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రెజెంట్ ‘తలైవర్ 170’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇది ఇలా ఉంటే, సోషల్ మీడియాలో రజినీకాంత్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రజినీకాంత్ ఒక అభిమాని ఇంటికి వెళ్లిన దృశ్యం కనిపిస్తుంది. ఆ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పుష్ప..

గతంలో రజినీకాంత్ యూఎస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒకరోజు ఉదయం మార్నింగ్ వాక్ లో జరిగిన వీడియో ఇది. అమెరికాలో ఉంటున్న ఒక తమిళ్ ఫ్యామిలీ రజిని చూసి వీధిలోనే ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టారు. అయితే ఆ కుటుంబం రజినీని లోపలికి రమ్మని పిలవలేక భయంతో అలాగే మాట్లాడుతున్నారు. ఇక ఇది గమనించిన రజినీకాంత్.. తానే వారితో నేను మీ ఇంటి లోపలికి రానా? అంటూ అడిగారు.

దీంతో ఆ కుటుంబం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇక రజిని రాకతో ఇంటిలోని వారంతా నిద్ర లేచారు. దీంతో రజిని.. మీ నిద్ర చెడగొట్టానా అంటూ వారితో మాట్లాడిన వైనం అందర్నీ ఆకట్టుకుంటుంది. పాత వీడియో అయిన ఇది.. ఇప్పుడు మళ్ళీ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. సూపర్ స్టార్ సింప్లిసిటీకి సలామ్ అంటున్నారు.

ఇక రజిని సినిమాలు విషయానికి వస్తే.. తలైవర్ 170 సినిమా షూటింగ్ జరుపుకుంటుంటే, ‘లాల్ సలామ్’ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. రజిని కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజిని ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.