సూపర్ కాప్ : దుమ్మురేపుతున్న సూర్యవంశి టీజర్

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 05:38 AM IST
సూపర్ కాప్ : దుమ్మురేపుతున్న సూర్యవంశి టీజర్

Updated On : December 28, 2019 / 5:38 AM IST

బాలీవుడ్ లో పవర్ ఫుల్ మాస్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలంటే వెంటనే గుర్తొచ్చే దర్శకుడు రోహిత్ శెట్టి. రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీఖాన్ జంటగా.. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘సింబా’. ఈ రోజుతో సింబా మూవీ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అజయ్ దేవ్ గణ్ తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశాడు. As We Proudly Celebrate One Year Of Simmba అంటూ ”సూర్యవన్షి” మూవీ టీజర్ షేర్ చేశాడు. సింగం, సింబా లాగానే 2020లో ‘సూర్యవన్షీ’ సినిమా కూడా మీ మనసులు దోచుకుంటుందని చెప్పాడు. 
 
సింబా సినిమా తర్వాత రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సినిమా సూర్యవన్షి. అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించనున్నారు‌. అంతేకాదు క్లైమాక్స్‌లో అక్షయ్, అజయ్, రణ్‌వీర్‌ కలిసి ఫైట్ చేసే సీన్ కూడా ఉంది.

”పవర్ ప్యాక్డ్ త్రయం సింగం, సింబా, సూర్యవంశి. గెట్ రెడీ.. ఆ రహీ హే పోలీస్.. 2020 మార్చ్ 27..” అంటూ అజయ్ ట్వీట్ చేశాడు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ టీజర్ చూశాక.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రణ్ వీర్ సింగ్ హీరోగా సింగమ్ సినిమాని రోహిత్ శెట్టి రీమేక్ చేశాడు. ఆ తర్వాత సింబాని రీమేక్ చేశాడు. ఫస్ట్ టైమ్.. రీమేక్ కాకుండా.. అక్షయ్ కుమార్ హీరోగా సూర్యవన్షి సినిమాని సొంత కథతో డైరెక్ట్ గా చేస్తున్నాడు రోహిత్ శెట్టి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.