పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న స్టార్స్..

క్వారంటైన్ టైమ్‌లో పిల్లలతో సరదాగా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్..

  • Published By: sekhar ,Published On : April 13, 2020 / 09:31 AM IST
పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న స్టార్స్..

Updated On : April 13, 2020 / 9:31 AM IST

క్వారంటైన్ టైమ్‌లో పిల్లలతో సరదాగా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోరు మీదున్నాడు. కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సెలబ్రిటీలంతా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. సినిమాల షూటింగ్స్ లేనపుడు ఖాళీ సమయంలో ఇంట్లో పిల్లలతో సరదాగా గడుపుతుంటానని మహేష్ స్వయంగా పలుమార్లు చెప్పడం జరిగింది.

Superstar Mahesh
ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఫ్యామిలీతో గడుపుతున్న సూపర్ స్టార్, ఎక్కువగా పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, అలానే పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి సరదాగా గడపడం చేస్తున్నారని ఇటీవల ఆయన సతీమణి నమ్రత ఒక పత్రికా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తాజగాగా తన కూతురు సితారతో కలిసి సరదాగా గడుపుతున్న ఒక ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు మహేష్. ప్రస్తుతం ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Read Also : ఏడు భాషల్లో సెన్సార్ కు రెడీ అయిన ‘ఓ మ‌నిషి నీవెవ‌రు’
మాస్ మహారాజా రవితేజ తన కుమార్తె, కుమారుడితో పాటు మిగతా ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం మాస్ రాజా, యువ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.