Vishwanath and sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కోసం సాలిడ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో హిట్ గ్యారంటీ
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons) మూవీ కోసం సాలిడ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Updated on- May 28, 2026 / 02:25 PM IST
Surya vishwanath and sons movie release date officailly confirmed
- సూర్య, వెంకీ అట్లూరి క్రేజీ కాంబినేషన్.
- ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.
- మరో హిట్ గ్యారంటీ
Vishwanath and sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ విజయం తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న సూర్య, అదే జోష్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ నెట్టింట హల్‌చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.
Vishnupriya Bhimeneni: ఎరుపు చీరలో.. ఎద అందాలు చూపిస్తూ.. విష్ణు ప్రియ గ్లామర్ రచ్చ
తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 14 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ సాలిడ్ డేట్‌ను లాక్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సూర్య సరసన యంగ్ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సెన్సేషనల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons)’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
