Sushanth Singh Rajput : షాకింగ్ మిస్టరీ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుల ఆత్మహత్యలు..

 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని షాక్ కి గురిచేసింది. బాలీవుడ్ లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణం తర్వాత ఈ కేసు చాలా రోజులు సాగింది. అనేక ట్విస్టులు...........

Sushanth Singh Rajput : షాకింగ్ మిస్టరీ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుల ఆత్మహత్యలు..

Sushanth Singh Rajput friends suicides goes viral in bollywood

Updated On : October 18, 2022 / 11:59 AM IST

Sushanth Singh Rajput :  2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని షాక్ కి గురిచేసింది. బాలీవుడ్ లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణం తర్వాత ఈ కేసు చాలా రోజులు సాగింది. అనేక ట్విస్టులు ఈ కేసులో బయటపడ్డాయి. తాజాగా రెండు రోజుల క్రితం సుశాంత్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి వైశాలి ఠక్కర్ కూడా సూసైడ్ చేసుకోవడంతో మరోసారి సుశాంత్ ఆత్మహత్య చర్చలోకి వచ్చింది. అయితే వైశాలి మరణంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

సుశాంత్ తో పాటు ఇప్పటికే ఆయన స్నేహితులు ముగ్గురు సూసైడ్ చేసుకోవడం చర్చకు దారి తీస్తుంది. జూన్ 14, 2020న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది హత్యే అని ఆరోపణలు ఉన్నా పోలీసులు దీన్ని ఆత్మహత్య అని కేసు నమోదు చేశారు. అయితే సుశాంత్ ఆత్మహత్యకి కేవలం అయిదు రోజుల ముందే 2020 జూన్ 9న సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్, మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. ఇది కూడా హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపించినా పోలీసులు ఆత్మహత్య అని కేసు క్లోజ్ చేసేశారు.

2021 ఫిబ్రవరి 15న సుశాంత్ మరో స్నేహితుడు సందీప్ నహార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌లో సందీప్ సుశాంత్‌తో కలిసి నటించాడు కూడా. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకుంది. తన సుసైడ్‌కు ఆమె ప్రియుడు కారణమంటూ ఓ నోట్ కూడా లభించిందని అంటున్నారు. కానీ ఈ మరణం వెనక కూడా ఎవరో ఉన్నారు అని సన్నిహితులు అంటున్నారు.

Allu Aravind: “చరణ్-అర్జున్” టైటిల్ తో భారీ మల్టీస్టారర్.. అల్లు అరవింద్ ప్రకటన!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అతని స్నేహితులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం, హత్య అని సన్నిహితులు ఆరోపించడం, పోలీసులు అవి సూసైడ్స్ అని కేసు క్లోజ్ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మరి పోలీసులు ఈ కోణంలో విచారిస్తారా లేదా అనేది తెలియదు. వైశాలి ఠక్కర్ మరణం కూడా బాలీవుడ్ లో సంచలనంగా మారింది. సుశాంత్ కేసులో అతనికి తగిన న్యాయం జరగలేదని అభిమానులు, కుటుంబ సభ్యులు నేటికీ అభిప్రాయపడుతున్నారు.