MS Dhoni : ధోని బయోపిక్ రీరిలీజ్.. థ్యాంక్యూ అంటున్న సుశాంత్ అభిమానులు..
ఇటీవల గత కొంతకాలంగా పలు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని బయోపిక్ ని కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు.

Sushanth Singh Rajput movie MS Dhoni Biopic Re Release
MS Dhoni : భారతదేశానికి(India) వరల్డ్ కప్(World Cup) తీసుకొచ్చి ఇండియన్ క్రికెట్(Cricket) ని మరో లెవల్ కి తీసుకెళ్లిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni). దేశ విదేశాల్లో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే ధోని వస్తున్నాడంటే అతన్ని చూడటానికి లక్షల్లో జనాలు క్యూ కడతారు. ఇక IPL మ్యాచ్ లలో ఏ స్టేడియం అయినా సరే, ఎవరితో మ్యాచ్ అయినా సరే స్టేడియం అంతా ఆయన అభిమానులే ఉంటారు. ధోని.. ధోని అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తారు. అంత ఇష్టం ధోని అంటే. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని తన ఆటతో, వ్యక్తిత్వంతో సంపాదించుకున్నాడు మహి.
ధోని జీవిత చరిత్రని MS ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ అనే టైటిల్ తో బయోపిక్ గా తెరకెక్కించి 2016 లో రిలీజ్ చేయగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్రలో అందర్నీ మెప్పించాడు. దిశా పటాని, కియారా అద్వానీ, భూమిక, అనుపమ్ ఖేర్.. ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని ధోని చిన్నప్పటి నుంచి అతని జీవితం, క్రికెట్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఇండియన్ టీంలోకి ఎలా ఎంటర్ అయ్యాడు, అతను చూసిన బాధలు, సక్సెస్, 2011 వరల్డ్ కప్ ని ధోని ఎలా సాధించాడు.. ఇలా అన్ని అంశాలతో ఎమోషనల్ గా, ఆసక్తిగా తెరకెక్కించారు. దీంతో ధోని బయోపిక్ అతని అభిమానులనే కాక అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇటీవల గత కొంతకాలంగా పలు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని బయోపిక్ ని కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. ధోని బయోపిక్ ని తెలుగు, తమిళ్, హిందీలో మే 12న రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ధోని అభిమానులతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుశాంత్ ధోని పాత్రలో అద్భుతంగా చేసి అందర్నీ మెప్పించాడు. ధోని కూడా సుశాంత్ తన పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు అని అన్నాడు. సుశాంత్ కెరీర్ లో కూడా ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుశాంత్ కొన్నాళ్ల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతన్ని స్క్రీన్ పై చూసే అవకాశం రావడంతో అతని అభిమానులు ఎమోషనల్ ఫీల్ అవుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Maahi phir aa raha hai!! M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May in Hindi, Tamil and Telugu#MSDhoniTheUntoldStory @msdhoni #sushantsinghrajput @starstudios_ @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat pic.twitter.com/bOFtEaup4X
— Ramesh Bala (@rameshlaus) May 4, 2023