Sushanth : నా సినిమాలు నా చేతుల్లో ఉండవు.. ఇక నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తా..

సుశాంత్ ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.

Sushanth : నా సినిమాలు నా చేతుల్లో ఉండవు.. ఇక నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తా..

Sushanth wants to act as character artist also no only hero

Updated On : April 4, 2023 / 10:10 AM IST

Sushanth :  అక్కినేని(Akkineni) ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్. కాళిదాసు(Kalidasu) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ ఆ తర్వాత కరెంట్(Current), అడ్డా(Adda) సినిమాలతో మెప్పించాడు. మధ్యలో ఒక సినిమా ఫ్లాప్ అయినా చిలసౌ(Chi La Sow) సినిమాతో మరోసారి ప్రేక్షకులని మెప్పించాడు. కరోనా ముందు అలవైకుంఠపురంలో(Alavaikuntapuramlo) సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ వేశాడు. దీంతో సుశాంత్(Sushanth) ఏంటి హీరోగా చేయకుండా ఇలా క్యారెక్టర్స్ వేస్తున్నాడు అనుకున్నారు అంతా.

అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మళ్ళీ వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.

సుశాంత్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. చాలా తక్కువ సినిమాలు చేశాను. నా సినిమాలు లేట్ అవ్వడమో, అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోవడమో జరిగేవి. ఎందుకు అలా జరిగేదో నాకు అర్ధమయ్యేది కాదు. అసలు నా సినిమాలు నా చేతుల్లో ఉండవు. చిలసౌ సినిమా తర్వాత గ్యాప్ రాకూడదు వరుసగా సినిమాలు చేయాలి అనుకున్నాను. కానీ కరోనా గ్యాప్ వచ్చింది.

Upasana : సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను..

అలవైకుంఠపురంలో సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అయింది ఆ సినిమా. ఆ సినిమాతో నాకు నార్త్ లో కూడా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అలాంటి అవకాశాలు చాలానే వచ్చాయి. దీంతో హీరోగా చేస్తూనే ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేయాలనుకున్నాను. అలా వచ్చిన అవకాశాల్లో రవితేజ రావణాసుర, చిరంజీవి భోళా శంకర్ సినిమాలని ఓకే చేసుకున్నాను. ఇకపై కూడా ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తాను. హీరోగా కూడా సినిమాలు చేస్తాను అని తెలిపాడు.