Mahesh Babu: మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి ఈ ఆగస్టు 15న నిజంగా పెద్ద పండుగే?
రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రచారం తప్ప ఇప్పటివరకు అధికారికంగా..
రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో సినిమాపై ఫ్యాన్స్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. సినిమాపై ఎలాంటి సమాచారం ఇవ్వని డైరెక్టర్‌ఫై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట.. ఇంతవరకు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని ఊహాగానాలే కానీ, ఇప్పటివరకు అఫీషయల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ నెల 9న మహేశ్ పుట్టిన రోజు సందర్భంగానైనా సినిమాపై అప్డేట్ వస్తుందా? అంటే అదీ లేదు. దీంతో అప్‌సెట్ అయిన ఫ్యాన్స్… రాజమౌళిపై కారాలు మిరియాలు నూరుతున్నారట…
దర్శకధీరుడు రాజమౌళిపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారని టాలీవుడ్ టాక్. మహేష్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి సినిమాపై తప్పకుండా అప్డేట్ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైందట… దీంతో తమ హీరో బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోయామని ఫీల్ అవుతున్నట్లు చెబుతున్నారు. మహేశ్ ఫ్యాన్స్‌ని రాజమౌళి అసలు పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారంటున్నారు.
తమ అభిమాన స్టార్ తప్పకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తాడని ఎదురుచూసిన తమకు ఇలా నిరుత్సాహపరచడం బాగోలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తమ హీరోకు అందరూ బర్త్‌డే విషెస్ చెప్పినా, రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా ఫ్యాన్స్ నిరసనకు కారణమవుతోందంటున్నారు.
రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రచారం తప్ప ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహపడుతున్నారంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాజమౌళి అతి త్వరలోనే ఒక మంచి అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 15న సినిమాపై అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది ఇదే కనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి ఆగస్టు 15 నిజంగా పెద్ద పండుగే అంటున్నారు.
Also Read: మీడియా రంగంలోకి నాగబాబు.. జనసేనకు కలిసొస్తుందా..?