Different : ‘డిఫరెంట్’ మూవీ రివ్యూ..

ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 18న థియేటర్స్ లో రిలీజయింది.

Different : ‘డిఫరెంట్’ మూవీ రివ్యూ..

Suspense Thriller Different Movie Review

Updated On : April 20, 2025 / 10:13 AM IST

Different Movie Review : నితిన్ నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘డిఫరెంట్’. వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎన్.ఎస్.వి.డి. శంకరరావు నిర్మాతగా డ్రాగన్ ఉదయ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 18న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. న్యూజిలాండ్ లో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక సైకో చేస్తున్నాడు అనుకోని న్యూస్ లో చెప్తుంటారు. పోలీస్ లు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఈ కేసుని డీల్ చేస్తూ ఉంటారు. బాబ్(నితిన్ నాష్) ఒక్కడే ఇంట్లో ఉంటాడు. అదే ఇంట్లో బాబ్ వాళ్ళ అమ్మ సన ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉంటుంది. ఒక ముగ్గురు అమ్మాయిలు ఆ ఇంట్లోకి వచ్చి బాబ్ ని చంపుదాం అని చూస్తారు. అసలు బాబ్ ఒక్కడే ఎందుకు ఉంటాడు? వాళ్ళ అమ్మ రూమ్ లోనే ఎందుకు ఉంటుంది? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? హత్యలు చేసేది ఎవరు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also See : Abhinaya Wedding Photos : ప్రియుడితో నటి అభినయ పెళ్లి.. మరిన్ని ఫొటోలు..

సినిమా విశ్లేషణ.. వరుసగా హత్యలు జరగడం, ఒక సైకో.. లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్ గా వస్తునే ఉన్నాయి. ఇది కూడా అదే కోవలోకి చెందింది. అయితే సినిమా అంతా న్యూజిలాండ్ లో తెరకెక్కించారు. అలాగే ఆల్మోస్ట్ కథ అంతా ఒకే ఇంట్లో జరుగుతుంది. దీంతో ఒకే ఇంట్లో సస్పెన్స్ థ్రిల్లింగ్ అనేది బాగానే రాసుకున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తిని మెయింటైన్ చేసారు.

నటీనటులు, సాంకేతిక అంశాలు.. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో అనేది భయం రూపంలో నితిన్ బాగా చూపించాడు. అమ్మ పాత్రలో సన, ముగ్గురు అమ్మాయిలు బాగానే నటించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా లైటింగ్ వర్క్ బాగుంది. ఒకే లొకేషన్ లో అయినా బోర్ కొట్టకుండా మంచి స్క్రీన్ ప్లే తో బాగానే నడిపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘డిఫరెంట్’ సినిమా ఒక సస్పెన్స్ సైకో థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

Suspense Thriller Different Movie Review

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.