18న సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్

  • Published By: madhu ,Published On : September 12, 2019 / 05:49 AM IST
18న సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్

Updated On : September 12, 2019 / 5:49 AM IST

స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి విడుదలకు సిద్ధమౌతోంది. ఇందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉయ్యాలవాడగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేంద్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా..కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ అభిమానులను ఎంతో అలరించింది. చిరంజీవి నటన సూపర్బ్ అంటూ మెచ్చుకున్నారు. చిత్ర లుక్స్‌కి, మేకింగ్ వీడియోకి, టీజర్‌ విశేషమైన స్పందన లభించింది. స్వాతంత్ర్యం రోజుల్లో ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయో అలాంటి సెట్లు వేశారు. సినిమాలో క్లైమాక్స్ సీన్ అదరహో అనిపిస్తాయని అంటోంది చిత్ర యూనిట్. 

సినిమాకు సంబంధించి సెప్టెంబర్ 18వ తేదీన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, పవర్ స్టార్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా వచ్చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 02వ తేదీన సైరా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో సినిమా రూపొందింది.