Mr Pregnant: మిస్టర్ ప్రెగ్నెంట్ మీద కొంత‌మంది నెగిటివ్ కామెంట్స్‌.. మీవ‌ల్ల చాలా మంది న‌ష్ట‌పోతున్నారు : సోహైల్

బిగ్‌బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్ న‌టించిన చిత్రం మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్‌. ఈ సినిమా ఆగ‌స్టు 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Mr Pregnant: మిస్టర్ ప్రెగ్నెంట్ మీద కొంత‌మంది నెగిటివ్ కామెంట్స్‌.. మీవ‌ల్ల చాలా మంది న‌ష్ట‌పోతున్నారు : సోహైల్

Syed Sohel

Updated On : August 19, 2023 / 6:14 PM IST

Mr Pregnant Success Meet : బిగ్‌బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్ (Syed Sohel) న‌టించిన చిత్రం మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌(Mr Pregnant). నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్‌(Roopa Koduvayur). మైక్ మూవీస్ బ్యాన‌ర్‌పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి లు నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్టు 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ రావ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

Allu Ayaan : అమ్మమ్మ, తాతయ్యలతో అల్లు అయాన్.. నల్గొండలో తనయుడు అయాన్‌తో బన్నీ సందడి..

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా హీరో సోహైల్ మాట్లాడుతూ.. క‌ష్టానికి త‌గిన ప్ర‌తి ఫ‌లం ద‌క్కింద‌న్నాడు. తానొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు. అయితే.. యూట్యూబ్‌లో కొంద‌రు సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నార‌ని వారి వ‌ల్ల సినిమా కోసం ప‌ని చేసే ఎంతో మంది న‌ష్ట‌పోతున్నార‌న్నారు.

Anasuya : ఏడుస్తున్న వీడియోని షేర్ చేసిన అనసూయ.. ఆనందంతో పాటు బాధ కుడా జీవితంలో భాగమే..

Mr Pregnant Success Meet

Mr Pregnant Success Meet

‘నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఈరోజు ఫలితం ద‌క్కింద‌ని భావిస్తున్నా. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారు. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సిటీలో మల్టీఫ్లెక్స్ కు వెళ్లి సినిమాని చూశా. ఆ త‌రువాత బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారు. ఒక మంచి సినిమా చేశామని చెబుతున్నారు. పబ్లిక్ టాక్ వినండి.. ఏ ఒక్కరూ నెగిటివ్ గా చెప్పలేదు. అక్కడే మేము సక్సెస్ అయ్యాం. యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్.. సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి.’ అని సోహైల్ అన్నారు.