Taapsee : పెళ్లిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రగ్నెంట్ నా?

తాజాగా తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు.

Taapsee : పెళ్లిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రగ్నెంట్ నా?

Taapsee Pannu Sensational Comments on Marriage in Fans chitchat at Social Media

Updated On : July 18, 2023 / 7:42 AM IST

Taapsee Pannu :  తెలుగులో రాఘవేంద్ర రావు(Raghavendra Rao) దర్శకత్వంలో ఝమ్మంది నాదం(Jhummandi Naadam) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసింది. తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్(Bollywood)కి చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది తాప్సీ. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.

తాప్సీ తన సినిమాల కంటే ఇటీవల వివాదాలు, సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కంగనాతో వివాదం, సౌత్ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్.. ఇలా పలుమార్లు వివాదంలో నిలిచింది తాప్సీ. తాజాగా తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

Project K : ఇది అప్డేటా? దీనికోసం మళ్ళీ లేట్.. ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్‌పై అభిమానులు, నెటిజన్ల విమర్శలు..

ఇందులో భాగంగా ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు. దీనికి తాప్సీ సమాధానం చెప్తూ.. పెళ్లి ఎందుకు, నేనేమి ప్రెగ్నెంట్ ని కాదు పెళ్లి చేసుకోవడానికి. త్వరలో పెళ్లి చేసుకోను. చేసుకుంటే చెప్తాను అని చెప్పింది. అయితే ఈ సమాధానం తాప్సీ నవ్వుతూ వ్యంగ్యంగా చెప్పినా పెళ్లిపై ఇలా కామెంట్స్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. మరోసారి పలువురు నెటిజన్లు తాప్సీపై విమర్శలు చేస్తున్నారు.