ఢిల్లీలో ఓటుపై….నెటిజన్ నోరు మూయించిన తాప్సీ

హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే?
శనివారం(ఫిబ్రవరి-8,2020)ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాప్సీ కూడా తన ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు వేసిన అనంతరం తన కుటుంబంతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. పన్ను పరివార్ ఓటు వేసింది. మరి మీరు?ప్రతి ఒక్క ఓటు కౌంట్ అంటూ ఫొటోను ట్వీట్ చేసింది తాప్సీ.
అయితే ఢిల్లీకి చెందిన నిఖిల్ రాథోర్ అనే నెటిజన్ తాప్సీ ఫొటోను రీట్వీట్ చేస్తూ…ముంబైలో నివసించే ప్రజలు మా కోసం ఎందుకు నిర్ణయిస్తున్నారు. టాప్సీ ముంబై మకాం మార్చి చాలా కాలం అయ్యింది. ఆమె ఓటును కూడా ముంబైకి మార్చుకోవాలని ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ చూసిన తాప్సీకి చిర్రెత్తుకొచ్చింది.
ఆ నెటిజన్ ట్వీట్ కు స్పందించాలని తాప్సీ డిసైడ్ అయింది. వెంటనే ట్విట్టర్ లోకి వెళ్లి…ముంబై కంటే ఎక్కువగా కాకపోయినా నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నా ఆదాయానికి ఢిల్లీ ద్వారా పన్ను విధించబడుతుంది. బహుశా కాంట్రిబ్యూట్ చేయకుండా ఇక్కడ నివసిస్తున్న చాలా మంది ఇతరులకన్నా కంటే నేను ఢిల్లీయట్ కన్నా ఎక్కువ. దయచేసి నా పౌరసత్వాన్ని ప్రశ్నించవద్దు. మీ గురించి,ఢిల్లీకి మీ కాంట్రిబ్యూషన్ గురించి ఆందోళనచెద్దవద్దు అని తాప్సీ ట్వీట్ చేసింది.
అయితే తాప్సీ కోసం అంతటితో ఆగలేదు. మళ్లీ ఇంకో ట్వీట్ చేసింది. ఒక అమ్మాయిని మీరు ఢిల్లీ నుంచి వేరేచోటుకి తీసుకెళ్లవచ్చే. కానీ ఈ అమ్మాయి నుంచి ఢిల్లీని తీసుకెళ్లలేరు. నేను ఏం చెయ్యాలో,చెయ్యకూడదో నువ్వు చెప్పడానికి లేదు. నేను ఎంత ఢిల్లీయట్ నో నీకు చెప్పడానికి ఈ సమాధానం సరిపోతుందని అనుకుంటున్నా అంటూ తాప్సీ కసితీరా ఆ నెటిజన్ కు బుద్ధి చెప్తూ ట్వీట్ చేసింది.
ఢిల్లీలో పుట్టిపెరిగిన తాప్సీ…2010లో రాఘవేంద్రరావు డైరక్షన్ లో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్రరావు చేతులమీదుగా లాంఛ్ అయిన ఈ అమ్మడు మొదటిసినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన తాప్సీ కొంతకాలం తెలుగు,తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైన ఈ క్యూట్ బ్యూటీ ముంబైలో తన సోదరితో కలిసి ఉంటోంది. తాప్సీ నటించిన తాప్పడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.