రూ. కోటి కావాలట: టబూ పాత్రలో ఎవరు?

ఆయుష్మాన్ ఖుర్రానా హీరోగా టబూ మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సినిమా ‘అంధాధున్’. ఈ సినిమా తెలుగు రీమేక్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. హిందీ వెర్షన్‌లో ఆయుష్మాన్ ఖుర్రానా పాత్రను యంగ్ హీరో నితిన్ తెలుగులో పోషిస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ సినిమా బ్లాక్ బస్టర్ అవగా.. అదే జోష్‌తో శ్రేష్ఠ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే టాలీవుడ్‌కి కూడా టబూ బాగా పరిచయం కావడంతో తెలుగులో కూడా ఆమె పాత్రను టబూ చేతే చేయించాలని చిత్రయూనిట్ భావిస్తుందట. ఈ క్రమంలో ఆమెను సంప్రదించింది చిత్రయూనిట్. అయితే తెలుగులో అదే పాత్రలో చెయ్యడానికి రూ. కోటి వరకు ఆమె రెమ్యునరేషన్ అడుగుతుందట. దీంతో ఎవరిని ఆ క్యారెక్టర్‌కి తీసుకోవాలనేదానిపై చిత్రయూనిట్ సమాలోచనలు జరుపుతుంది. యాంకర్ అనసూయను కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
కానీ, టబూ పాత్రకు అనసూయ సెట్ అవుతుందా? అని కూడా అనుమానం ఉంది. ఈ క్రమంలో ఎవరిని ఆ పాత్రకు తీసుకుంటారు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. టబూ పాత్ర సినిమాలో కాస్త నెగెటివ్ రోల్.. అయితే అటువంటి పాత్రను చెయ్యాలంటే కచ్చితంగా చాలా పరిణతి ఉండాలి. మరి తెలుగులో ఆ పాత్రను ఎవరు చేస్తారో? చూడాలి.
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమా అయిన ‘అంధాధున్’ 2018లో విడుదలైంది. ఆయుష్మాన్ ఖురానాకు ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా బ్లైండ్‌గా నటిస్తాడు. అతను ఒక హత్య జరగడం చూస్తాడు. ఆయుష్మాన్ నిజంగా గుడ్డివాడు కాదు. అయితే చివరకు ఏమైంది అనేది అధ్భతమైన స్క్రీన్ ప్లే తో సినిమా ఉంటుంది. ఆయుష్మాన్ కు జోడీగా ఈ సినిమాలో రాధికా ఆప్టే నటించింది.