స్పందించాడు, స్క్రీన్ షాట్ తీసింది.. ఇన్‌స్టా వల్ల విసిగిపోయానంటున్న పునర్నవి
పునర్నవి భూపాలం ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్దిరోజుల పాటు యాడ్ స్టోరీస్ షేర్ చేయనని తెలిపింది..

పునర్నవి భూపాలం ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్దిరోజుల పాటు యాడ్ స్టోరీస్ షేర్ చేయనని తెలిపింది..
సోషల్ మీడియా.. భగంతుడికీ, భక్తులకీ అనుసంధానమైనది అగరొత్తి అన్నట్లు సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య స్నేహానికి వారధిగా నిలుస్తోంది. వారు పెట్టే పోస్టులకు మంచిగా స్పందిస్తే పర్లేదు కానీ వెకిలి మాటలతో, వెటకారపు చేష్టలతో విసిగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. తాజాగా పునర్నవి భూపాలం కొద్ది రోజుల పాటు తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ స్టోరీస్ షేర్ చేయనని చెప్పింది.
అసలేం జరిగిందంటే?..
ఇటీవల ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్ లాకర్ రూమ్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పునర్నవి స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాలో పిల్లలు ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే’ అంటూ యాడ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టగా.. నెటిజన్లు పలు కామెంట్లు చేశారు.
‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసమే ఇలాంటి పోస్టులు పెడుతున్నారు..’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి పునర్నవి మళ్లీ యాడ్ స్టోరీగా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో.. సదరు నెటిజన్ స్నేహితుడు స్పందిస్తూ.. ‘మీరు పెట్టిన పోస్ట్ వల్ల తల్లిదండ్రుల వద్ద అతని పరువు పోతుంది’ అంటూ కామెంట్ చేశాడు. ‘నేను సోషల్ మీడియాలోకి వచ్చింది ఎవరిని దూషించడానికి, నిందించడానికి కాదు.. ఇన్‌స్టాగ్రామ్ అనేది కొన్ని సార్లు విషపూరితమైన సాధనంగా మారుతోంది. నేను పూర్తిగా ఇన్‌స్టాతో విసిగిపోయాను. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అంటూ మరో పోస్ట్ చేసింది.
Also Read | నలుగురు చెప్తే ఒక్క విష్ణు వినడా!.. టిక్‌టాక్‌లోకి మంచు హీరో ఎంట్రీ..