చిరంజీవి ఇంట్లో భేటీ తర్వాత మంత్రి తలసాని వ్యాఖ్యలు

కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తెలుగు సినిమా పరిశ్రమను తిరిగి ఎలా గాడిలో పెట్టాలనే అంశాలపై కీలక చర్చలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చిరంజీవి ఇంటికి రాగా.. వీరిద్దరితో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు.
సినీ పరిశ్రమ ఇబ్బందులపై చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్.శంకర్, కొరటాల శివ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
లాక్‌డౌన్ సడలింపులు వచ్చిన క్రమంలో సినీ పరిశ్రమలో తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చలు జరుపుతున్నారు. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ చెయ్యాలి. షూటింగ్స్‌ను తిరిగి ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ? అనే విషయాలను ఈ సమావేశంలో చర్చించారు.
అనంతరం ఆయన మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామని తెలిపారు. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో చిరంజీవి కమిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారని, మొత్తం 14 వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని, ప్రభుత్వం కూడా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.
Read:షూటింగ్ లు ఎలా : చిరంజీవి ఇంట్లో కీలక భేటీ..మంత్రి తలసాని హాజరు