Naga Chaitanya : తమన్నా, నాగ చైతన్య కొత్త షో హోస్ట్ చేయబోతున్నారా?
ఒకే సెట్‌లో అక్కినేని నాగ చైతన్య, మిల్కి బ్యూటీ తమన్నా కనిపించారు. ఇది నా సెట్ అంటే నాదని వాదించుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి ఏదైనా షో హోస్ట్ చేస్తున్నారా? లేక చూసే జనాలపై ప్రాంక్ చేసారా?

Naga Chaitanya
Naga Chaitanya : సోషల్ మీడియాకు దూరంగా ఉండే అక్కినేని నాగ చైతన్య రీసెంట్‌గా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు. తాజాగా తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ముంబయి వెళ్లిన నాగ చైతన్యపై మిల్కీ బ్యూటీ తమన్నా ప్రాంక్ చేసింది. చై కూడా ఆమెకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ మేటర్ ఏంటి? అంటే..
సోషల్ మీడియాకు దూరంగా ఉండే హీరో నాగ చైతన్య రీసెంట్‌గా యూట్యూబర్‌గా మారారు. తన సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’ ప్రమోషన్ కోసం చైతూ ముంబయి వెళ్లిన సమయంలో మిల్కీ బ్యూటీ తమన్నాను కలిసారు. అప్పుడే తమన్నా ఒక ప్రాంక్ చేయాలని అనుకున్నారు. నాగ చైతన్య సెట్‌లోకి వెళ్లగానే తమన్నా మేకప్ వేసుకుంటూ కనిపించారు. ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? అంటూ నాగ చైతన్యను అడిగారు. అమెజాన్ ప్రైమ్ వాళ్లు పిలిస్తే వచ్చానని నాగ చైతన్య చెప్పారు. ఇది తన సెట్ అని తమన్నా అంటే.. నన్ను కూడా ఇక్కడికే రమ్మన్నారని చైతన్య చెప్పారు. ఇక తన షూటింగ్‌కు సంబంధించిన పేపర్లు తెచ్చి మరీ చూపించారు తమన్నా.
Guntur Kaaram : గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
అక్కడ షూట్ ఎవరిదో కన్ఫమ్ చేసుకునేందుకు నాగ చైతన్య టీమ్‌కి ఫోన్ చేసారు. తమన్నా ఫోన్ తీసుకుని మాట్లాడి పెట్టేసారు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఒకే సెట్‌లో రెండు మూడు షూటింగ్స్ పెట్టుకుంటున్నారని వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. తమన్నా నాగ చైతన్యను చక్కగా డెకరేట్ చేసిన రూంలోకి తీసుకువెళ్తారు. ఇక్కడేదో చిన్నపిల్లల పుట్టినరోజు పార్టీ అని చై అనే లోపు తమన్నా అక్కడ ఉన్న బోర్డుపై కవర్ తీస్తారు. ‘వెల్ కమ్ టు అమెజాన్ ప్రైమ్ నాగ చైతన్య’ అని బోర్డ్ పై రాసి ఉంటుంది.
ఒక్కసారిగా షాకైనట్లు కనిపించిన నాగ చైతన్య తమన్నాకు థ్యాంక్స్ చెబుతూ ఆమె కోసం ఒకటి తెచ్చానంటూ ఒక స్లిప్ ఇస్తారు. తమన్నా మిమ్మల్ని ప్రాంక్ చేయబోతోందని ఆ చీటీలో రాసి ఉండటం చూసి తమన్నా షాకవుతుంది. నీకు ఇది ఎవరిచ్చారు? అని చైతన్యని తమన్నా అడిగేలోపు ‘టు నో మోర్.. వాచ్ దూత’ అంటారు నాగ చైతన్య. ఈ తతంగమంతా నాగ చైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగమని చూసేవారికి అర్ధమైపోయింది.
Aadi Keshava : శ్రీలీలతో ప్రేమ.. విలన్స్‌తో శివతాండవం.. ‘ఆదికేశవ’ ట్రైలర్ రిలీజ్..
నాగ చైతన్యతో ఆల్రెడీ రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో దూత వెబ్ సిరీస్ రాబోతోంది. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరిస్ డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. రూ.40 కోట్ల బడ్జెట్ తో శరద్ మరార్ ప్రైమ్ వీడియోతో కలిసి ఈ సిరీస్ నిర్మించారు. నాగ చైతన్య ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. కాగా నాగ చైతన్య, చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా #NC23 . సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే విధంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Whooh ho✨😭 Have a look tweeps
Tam & Chay is here 💥 @chay_akkineni @tamannaahspeaksLooks like Tam gonna host an show? Let’s see #DhoothaOnPrime 😉#ChayAkkineni #TamannaahBhatia pic.twitter.com/YQUcqign29
— Aathavan_Tamannaah☕🖤 (@Aathavan_speaks) November 20, 2023