Vishal : రైతులకు కేజీఎఫ్ హీరో ‘యశ్’ చేసే సహాయం గురించి ఎవరికి తెలియదు..

కేజీఎఫ్ హీరో యశ్ ఎవరికీ తెలియకుండా ఎన్నో సేవలు చేస్తుంటాడని హీరో విశాల్ చెప్పుకొచ్చాడు.

Vishal : రైతులకు కేజీఎఫ్ హీరో ‘యశ్’ చేసే సహాయం గురించి ఎవరికి తెలియదు..

tamil star Vishal about KGF star Yash social services

Vishal : కోలీవుడ్ హీరో విశాల్ పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని అందరికి తెలిసిన విషయం. ఈక్రమంలోనే రైతులకు కూడా విశాల్ సహాయం చేస్తూ వస్తున్నాడు. ఒకసారి తన సినిమా షూటింగ్ ఒక ఊరిలో జరిగింది. ఆ ఊరిలోని రైతులు త్రాగడానికి ఒక చెరువులోని నీరుని ఉపయోగిస్తున్నారు. ఆ చెరువులో ఎక్కువ నీరు లేవు, ఉన్న నీరు కూడా బాగోలేదు. ఇక అది చూసిన విశాల్.. అక్కడ సినిమా షూటింగ్ అయ్యేలోపు ఒక బోరుబావిని వేయించాడు. ఇక అప్పటి నుంచి ఒక గొప్ప నిర్ణయానికి కూడా పూనుకున్నాడు.

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ అవుట్.. రీజన్ ఏంటి..?

తన సినిమాకి ఎన్ని టికెట్స్ తెగితే అన్ని రూపాయిల తన సొంత డబ్బుని ఉపయోగించి రైతులకు నీరు అందించే ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాడు. అది ఒకటే కాదు, రైతులకు పలు సేవలు చేస్తూ వస్తున్నాడు. తమిళనాడుతో పాటు తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో కూడా చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ విషయం గురించి విశాల్ ని ప్రశ్నిస్తూ.. అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలు అన్ని మీ చేతులు మీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయా..? అని అడిగారు. ఇక విశాల్ బదులిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Akhil Akkineni : ఇంకా ఏజెంట్ గెటప్‌లోనే అఖిల్.. కారణం ఏంటంటున్న నెటిజెన్స్..

ఈక్రమంలోనే కేజీఎఫ్ హీరో ‘యశ్’ (Yash) తనకి బెస్ట్ ఫ్రెండ్ అని, కన్నడలో తానే చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఇక విశాల్ చేస్తున్న సేవలు తాను స్వయంగా చెప్పుకుంటున్నాడని, కానీ యశ్ చేసే సహాయాలు గురించి తాను ఎవరికీ చెప్పుకోడని తెలియజేశాడు. యశ్ ఎవరికీ తెలియకుండా ఎన్నో సేవలు చేస్తుంటాడని వెల్లడించాడు. విశాల్ కి తెలిసిన వరకు యశ్ ఒక ఐదు గ్రామాలకు మొత్తం నీరు సరఫరా ఉండేలా చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.