Bharathi Raja : అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు భారతీరాజా.. పరామర్శించిన సీఎం స్టాలిన్..

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా గత కొన్ని రోజులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స...........

Bharathi Raja : అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు భారతీరాజా.. పరామర్శించిన సీఎం స్టాలిన్..

Tamilanadu CM Stalin visits Bharathi Raja

Updated On : September 12, 2022 / 7:45 AM IST

Bharathi Raja :  ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా గత కొన్ని రోజులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఇంటివద్దే రెస్ట్ తీసుకుంటున్నారు.

Kriahnam Raju : నేడు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు భారతీరాజాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా సీఎం స్టాలిన్‌ ఆస్పత్రి వైద్యులకు ఫోన్‌ చేసి భారతీరాజా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. భారతీరాజా డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకొని సీఎం స్టాలిన్‌ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు డీఎంకే నాయకులు, సినీ గీత రచయిత వైరముత్తు కూడా వెళ్లి పరామర్శించారు.