సుకుమార్‌ని కలిసిన జనసేన, టీడీపీ నాయకులు

రామ్‌చరణ్ తేజ్ హీరోగా రంగస్థలం సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు సుకుమార్ మద్దతు కోసం పార్టీలు వెంపర్లాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుకుమార్‌ను కలిసి మద్దతు తెలపాలంటూ అగ్ర పార్టీల నేతలు కోరుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంను ఆంధ్రప్రదేశ్‌లో మొదలుపెట్టిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రముఖులను సైతం కలుస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు సమీపంలోని మలికిపురంలోని మట్టపర్రులో తెదేపా తరఫున పోటీచేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద రావులు వేరువేరుగా వెళ్లి సుకుమార్‌ను కలిశారు. తమకు మద్దతు తెలపాలంటూ కోరారు.