Ram Mohan Naidu : విజయ్ దేవరకొండ చేసిన సహాయానికి.. థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు..
శ్రీకాకుళం కోటబొమ్మాళికి మండలం కురుడు గ్రామంలో షర్మిల శ్రీ అనే పాప ఇటీవల ఓ యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంది. ఆ కుటుంబం కష్టాల్లో ఉండటంతో అక్కడి విజయ్ దేవరకొండ అభిమానుల సంఘం విజయ్ కి ఈ విషయం తెలియచేయగా..

TDP MP Ram Mohan Naidu Kinjarapu Says Thanks to Vijay Devarakonda for Helps to People
Ram Mohan Naidu Kinjarapu : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఓ పక్క సినిమాలతో అభిమానులను సంపాదించడమే కాకుండా మరో పక్క పలువురు పేదలకు సహాయం చేస్తూ, మంచి పనులు చేస్తూ కూడా ప్రజల్లో మంచిపేరుని, అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ, సమంత(Samantha) నటించిన ఖుషి(Kushi) సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్.. తన ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ అందిస్తాను అని తెలిపాడు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు అందాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం కోటబొమ్మాళికి మండలం కురుడు గ్రామంలో షర్మిల శ్రీ అనే పాప ఇటీవల ఓ యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంది. ఆ కుటుంబం కష్టాల్లో ఉండటంతో అక్కడి విజయ్ దేవరకొండ అభిమానుల సంఘం విజయ్ కి ఈ విషయం తెలియచేయగా.. మొన్న ఖుషి సినిమా సక్సెస్ లో భాగంగా ఈ ఫ్యామిలీకి కూడా లక్ష రూపాయలు అందేలా చేశారు.
Also Read : Nirupam Paritala : డాక్టర్ బాబు హీరోగా ఎందుకు చేయలేదు? సినిమాల్లో ఛాన్సులు రాలేదా?
విజయ్ దేవరకొండ అభిమానులు లక్ష రూపాయల చెక్కుని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఆ పాపకి అందచేశారు. దీనిపై ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దైవం మనుష్య రూపేణ అనే వాఖ్యానికి అర్ధంగా నిలుస్తూ నటుడు విజయ్ దేవరకొండ గారు చేసిన సహాయంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి తాను కూడా అండగా నిలబడతానని చెప్పి వారికి ఈ డబ్బులు వచ్చేలా చేసిన శ్రీకాకుళం విజయ్ దేవరకొండ అభిమానులను అభినందించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారగా పలువురు విజయ్ ని అభినందిస్తున్నారు.