Ram Charan: హీరో రామ్ చరణ్ ఇంటిలో టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ సందడి..

Ram Charan: హీరో రామ్ చరణ్ ఇంటిలో టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ సందడి..

Team India Players at Ram Charan's Residence

Updated On : September 26, 2022 / 4:51 PM IST

Ram Charan: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఇండియా T20 సిరీస్ గురించి మనకి తెలిసిందే. దీంతో నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్ ఆడడానికి వచ్చిన టీం ఇండియా 2-1 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ని “హార్దిక్ పాండ్యా” ఫోర్ కొట్టి ముగించాడు.

ఇక ఈ మ్యాచ్ అయ్యాక టీం ఇండియా.. హీరో రామ్ చరణ్ ఇంట సందడి చేసిందంటూ నెట్టింట ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ తో పాటు మరికొంతమంది ప్లేయర్స్ కు, చరణ్ తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడట, ఈ పార్టీకి చిరంజీవి కూడా హాజరయ్యారని తెలుస్తుంది.

ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రైవేట్ సిబ్బంది ఒకరు.. హార్దిక్ తో దిగిన ఫోటో నెట్టింట వైరల్ కాగా, ఈ విషయం వెలుగోలికి వచ్చింది. అయితే దీనిపై మెగాస్టార్ గాని, మెగాపవర్ స్టార్ గాని ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Ram Charan: రామ్‌చరణ్‌ ఇంట క్రికెటర్ల సందడి.. ఫొటో వైరల్‌