Teja Sajja : రవితేజ గారి వల్ల.. మాకు హీరోయిన్స్‌తో ఇబ్బంది.. తేజ సజ్జ వైరల్ కామెంట్స్..

రవితేజ వల్ల తాము హీరోయిన్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేజ సజ్జ వైరల్ కామెంట్స్ చేశారు.

Teja Sajja : రవితేజ గారి వల్ల.. మాకు హీరోయిన్స్‌తో ఇబ్బంది.. తేజ సజ్జ వైరల్ కామెంట్స్..

Teja Sajja viral comments about Raviteja in Eagle promotion interview

Updated On : January 28, 2024 / 2:27 PM IST

Teja Sajja : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ.. రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతూనే వస్తుంది. ఇది ఇలా ఉంటే, తేజ సజ్జ రీసెంట్ ఇంటర్వ్యూలో మాస్ మహారాజ్ రవితేజ పై వైరల్ కామెంట్స్ చేశారు. రవితేజ వల్ల తాము హీరోయిన్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అసలు తేజ సజ్జ ఎందుకు ఆ కామెంట్స్ చేశారు.

రవితేజ నటించిన కొత్త చిత్రం ‘ఈగల్’ ఫిబ్రవరిలో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్.. తేజ సజ్జ హోస్టుగా రవితేజతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇక ఇంటర్వ్యూలో తేజ సజ్జ మాట్లాడుతూ.. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఇద్దరి నుంచి నలుగురి వరకు హీరోయిన్స్ ఉంటున్నారు.

Also read : Hanuman Collections : అయ్యబాబోయ్.. అమెరికాలో ‘హనుమాన్’ కలెక్షన్స్ ఇంకా అదరగొడుతుందిగా.. ఇప్పట్లో ఆగేలా లేదు..

ఈక్రమంలోనే చిన్న హీరోల సినిమాలకు హీరోయిన్స్ దొరకాలంటే కష్టం అవుతుందట. ఎవరైనా సినిమా కోసం సంప్రదిస్తుంటే.. “ప్రస్తుతం రవితేజ గారి సినిమా చేస్తున్నాను. అది పూర్తీ అయిన తరువాత మీ సినిమా చేస్తాను” అంటూ చెబుతున్నారట. తేజ సజ్జ కూడా ఇది ఫేస్ చేశారట. ఈ విషయం గురించే తేజ సజ్జ.. ఇంటర్వ్యూలో మాట్లాడారు. “మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని లాక్ చేసేసుకొని మా యువ హీరోలను ఇబ్బందులు పెడుతున్నారు”.. అంటూ తేజ సజ్జ, రవితేజ పై కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ఈగల్ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంటే, అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ హనుమాన్ కోసం పోస్టుపోన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.