Benefit Shows : సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప 2 దెబ్బకు సినీ పరిశ్రమకు షాక్.. ఇకపై బెనిఫిట్ షోలు రద్దు..
తాజాగా పుష్ప 2 సినిమాకు కూడా బెనోఫిట్ షోలు వేశారు.

Telangana Government Serious on Sandhya Theater Tragic Incident No more Benefit Shows
Benefit Shows : పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు వస్తే ముందు రోజు లేదా అర్ధరాత్రి బెనిఫిట్ షోలు వేస్తారు. ప్రభుత్వం దగ్గర్నుంచి ఎక్కువ టికెట్ ధరకు మూవీ టీమ్స్ పర్మిషన్స్ తెచ్చుకొని మరీ బెనిఫిట్ షోలు వేస్తారు. ఇప్పటివరకు చాలా సినిమాలకు బెనిఫిట్ షోలు వేశారు. ఫ్యాన్స్ కూడా ఈ బెనిఫిట్ షోల కోసం ముందే సినిమా చూడాలని ఎదురుచూస్తారు. తాజాగా పుష్ప 2 సినిమాకు కూడా బెనోఫిట్ షోలు వేశారు.
అయితే హైదరాబాద్ సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోకు ఎలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వకుండానే అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు వచ్చి తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ మృతి చెందగా ఆ మహిళ కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే అల్లు అర్జున్ పై, అల్లు అర్జున్ టీమ్ పై, సంధ్య థియేటర్స్ పై పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు.
Also Read : Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ సక్సెస్ పార్టీ.. రాత్రి పూట పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..
తాజాగా ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బెనిఫిట్ షో లకు స్వస్తి చెప్పే దిశగా నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. దీంతో పుష్ప సినిమా బెన్ఫిట్ షో, ఈ ఘటన వల్ల తీసుకున్న ఈ నిర్ణయంతో టాలీవుడ్ కి ఎఫెక్ట్ అవ్వనుంది. మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారు. దీంతో వేరే హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఈ ఘటనకు కారణమైన వారిపై విమర్శలు చేస్తున్నారు.