Chiranjeevi : రాజ్ భవన్‌లో మెగాస్టార్.. చిరంజీవిని సత్కరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని అభినందించారు.

Chiranjeevi : రాజ్ భవన్‌లో మెగాస్టార్.. చిరంజీవిని సత్కరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai Soundararajan Felicitate to Megastar Chiranjeevi in Raj Bhavan

Updated On : February 9, 2024 / 7:44 PM IST

Chiranjeevi : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో మన మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్(Padma Vibhushan) అవార్డుని కూడా ప్రకటించారు. దీంతో చిరంజీవికి అభిమానుల దగ్గర్నుంచి, తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి, అనేక మంది ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు మెగాస్టార్ ని కలిసి అభినందించారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఓ కార్యక్రమం చేపట్టి చిరంజీవితో పాటు మిగిలిన పద్మ అవార్డుకి ఎంపికైన వారిని కూడా సత్కరించింది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) చిరంజీవిని అభినందించారు. గవర్నర్ తమిళిసై ఆహ్వానం మేరకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రాజ్ భవన్ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించి తమిళిసై అభినందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు.

Also Read : Teja Sajja : ‘ఈగల్’ డైరెక్టర్‌తో ‘హనుమాన్’ తేజ సజ్జ మూవీ?

ఈ సందర్భంగా దిగిన చిరంజీవిని సత్కరించిన ఫొటోలను గవర్నర్ తమిళిసై అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అలాగే చిరంజీవి కూడా ఈ ఫొటోలని షేర్ చేస్తూ గవర్నర్ తమిళిసైకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక త్వరలోనే టాలీవుడ్ కూడా చిరంజీవికి అభినందన సభ ఏర్పాటు చేయబోతోందని సమాచారం.