Aadhi Nikki Wedding: ఆది పెళ్లిలో స్టెప్పులేసిన నాని, సందీప్.. వీడియో వైరల్!

సౌత్ సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, తమిళ-తెలుగు సినిమాల నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడయ్యాడు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Aadhi Nikki Wedding: ఆది పెళ్లిలో స్టెప్పులేసిన నాని, సందీప్.. వీడియో వైరల్!

Aadhi Nikki Wedding

Updated On : May 18, 2022 / 8:25 PM IST

Aadhi Nikki Wedding: సౌత్ సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, తమిళ-తెలుగు సినిమాల నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడయ్యాడు. తెలుగులో గుండెల్లో గోదారి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆది.. ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’, ‘నీవెవరో’’,’ యూ టర్న్‌’, ‘గుడ్‌ లక్‌ సఖి’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా బిజీగా ఉండగానే తోటి నటి, తనతో నటించిన హీరోయిన్, కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానిని ఈరోజు (మే18) సాయంత్రం మనువాడాడు.

Aadhi Nikki Wedding

Aadhi Nikki Wedding

Aadhi – Nikki : ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని నిశితార్థ వేడుకలు

చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించగా.. ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన తెలుగు హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్ స్టెప్పులేసి సరదాగా గడిపారు. ప్రస్తుతం ఆది, నిక్కీతో కలిసి నాని, సందీప్ స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Aadhi-Nikki: ఆది పినిశెట్టి పెళ్లి.. సంప్రదాయబద్దంగా నిశ్చతార్ధం!

మరకతమణి సినిమాలో ఆది, నిక్కీ కలిసి నటించగా.. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పటి నుండే ఆది హీరోయిన్ నిక్కీ గల్రానితో ప్రేమలో ఉన్నాడని తమిళ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అనుకున్నట్లే రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు ఇలా పెళ్లి పీటలెక్కింది. మార్చి 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా ఆది, నిక్కీల నిశ్చితార్థం చేసుకోగా ఈరోజు పెళ్లి ఈ లవ్ కపుల్ ఒక్కటయ్యారు.