TFCC Elections : టాలీవుడ్ లో ఉత్కంఠ.. దిల్ రాజు వర్సెస్ సి.కళ్యాణ్.. నేడే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్..

నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు.

TFCC Elections : టాలీవుడ్ లో ఉత్కంఠ.. దిల్ రాజు వర్సెస్ సి.కళ్యాణ్.. నేడే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్..

Telugu Film Chamber of Commerce Elections Dil Raju Vs C Kalyan

Updated On : July 30, 2023 / 7:35 AM IST

TFCC Elections :  టాలీవుడ్ లో జరిగే ప్రతి ఎలక్షన్స్ రాజకీయ ఎలక్షన్స్ రేంజ్ ని తలపిస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఎలక్షన్స్ జరగనున్నాయి. నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు.

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు. నిర్మాతలే దాదాపు 1600 మంది ఉన్నారు. ఈ సారి ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కానున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇటీవల నిర్మాతల మండలిలో తలెత్తిన వివాదాలను దృష్టిలో పెట్టుకొని ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దిల్ రాజు, మైత్రి అధినేతలు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు.. ఇలా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న నిర్మాతలంతా ఒకవైపు ఉంటే అడపాదడపా సినిమాలు తీసేవాళ్ళు ఒకవైపు ఉన్నారు. దీంతో ఈ సారి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ రసవత్తరంగా అమారాయి. దిల్ రాజు ప్యానెల్, సి కళ్యాణ్ ప్యానెల్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.

OTT Censor : ఓటీటీ అధినేతలతో కేంద్రమంత్రి సమావేశం.. తీరు మార్చుకోకపోతే సెన్సార్ తెస్తామని వార్నింగ్..

నేడు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ మొదలుపెట్టి సాయంత్రం 6గంటలకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.