Telugu Film Shootings: సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్.. 25 నుంచే షురూ!

టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం మేరకు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాతల మండలి సినిమా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది. ఆగస్టు 25 నుంచి ప్రాధాన్యత క్రమంలో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu Film Shootings: సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్.. 25 నుంచే షురూ!

Telugu Film Shootings To Start From August 25th

Updated On : August 23, 2022 / 6:51 PM IST

Telugu Film Shootings: టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం మేరకు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతల మండలి పలు దఫాలుగా చర్చలు సాగిస్తోంది. అయితే సమస్యల పరిష్కారం కోసం చర్చలు సాగుతున్నా, ఓ నిర్ణయం మాత్రం రాలేదు.

Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!

దీంతో ఇండస్ట్రీలో సినిమా షూటింగ్‌లు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలి మరోసారి సమావేశం అయ్యారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లకు నిర్మాతల మండలి అనుమతినిచ్చింది. ఆగస్టు 25 నుంచి ప్రాధాన్యత క్రమంలో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. 23 రోజులుగా నిర్మాతలందరం అన్ని శాఖల్లోని సమస్యలపై చర్చిస్తున్నాం. ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.. మరో 2 రోజుల్లో మిగతా నిర్ణయాలు చెబుతాం.. సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకోవచ్చు.. అత్యవసరమైతే ఆగస్టు 25 నుంచి ఛాంబర్ అనుమతితో షూటింగ్స్ చేసుకోవచ్చు.. అని తెలిపారు.

Dil Raju About Resuming Shootings In Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్‌ల ప్రారంభంపై దిల్ రాజు కామెంట్స్

అటు నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని సమస్యలపై 23 రోజులుగా రోజుకు 5-6 గంటలు మాట్లాడుకున్నాం.. ఆగస్టు 30న మా తుది నిర్ణయాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెల్లడిస్తాం.. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్ సమస్య పరిష్కారమైంది.. తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లున్నాయి.. సెప్టెంబర్ 2 నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయడం లేదు.. టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి.. పెద్ద సినిమాలకు ఒక శ్లాబ్ ప్రకారం టికెట్ ధరలుంటాయి.. నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిబిటర్లకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తుంది.. మూవీ ఆర్టిస్టుల మేనేజర్లతో సమావేశం జరిగింది.. అని తెలిపారు. మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమలో ఎట్టకేలకు మళ్లీ షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతుండటం సంతోషించాల్సిన విషయం.