Telugu Movies : ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఏప్రిల్ మొదటి వారం ఈ వారంలో టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే...

Telugu Movies Ravanasura and Meter Releasing this week
Telugu Movies : టాలీవుడ్(Tollywood) లో ఫస్ట్ క్వార్టర్ సక్సెస్ ఫుల్ గానే ముగిసింది. సంక్రాంతికి(Sankranthi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీరసింహారెడ్డి(Veerasimha Reddy) సినిమాల సక్సెస్ తో మొదలుపెట్టి మార్చ్ ఎండింగ్ కి దసరా(Dasara) సినిమాతో గ్రాండ్ గా ముగించారు. సెకండ్ క్వార్టర్ తో పాటు ఇప్పుడు సమ్మర్(Summer) కూడా మొదలైపోయింది. సమ్మర్ లో స్కూల్స్, కాలేజీలకు హాలిడేస్ వస్తాయని తెలిసిందే. దీంతో సమ్మర్ రేసుకు సిద్ధమైంది టాలీవుడ్.
ఏప్రిల్ మొదటి వారం ఈ వారంలో టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే…
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటించడం విశేషం. హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్స్ షేడ్స్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు.
కిరణ్ అబ్బవరం హీరోగా, అతుల్య రవి హీరోయిన్ గా రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మీటర్. మీటర్ సినిమా కూడా ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. సినిమాపై పెద్దగా హైప్ లేకపోయినా ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
Baby Movie : ‘బేబీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ స్టార్ సింగర్.. సూపర్ అంటున్న మ్యూజిక్ లవర్స్!
తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ మెయిన్ లీడ్ లో స్వాతంత్య్రం వచ్చిన తెల్లారి ఓ ఊర్లో ఏం జరిగింది అనే కథాంశంతో ఆగస్టు 16, 1947 సినిమాని తెరకెక్కించారు. ఎన్.ఎస్ పొన్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో తెలుగులో కూడా డబ్బింగ్ చేసి ఈ సినిమాని ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నారు.