కొత్త సినిమాలకి.. ఏప్రిల్ లో ముహూర్తం పెట్టిన స్టార్ హీరోలు

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 05:34 AM IST
కొత్త సినిమాలకి.. ఏప్రిల్ లో ముహూర్తం పెట్టిన స్టార్ హీరోలు

Updated On : April 2, 2019 / 5:34 AM IST

ఖచ్చితంగా హిట్టుకొట్టాలనే కసితో ఉన్న ముగ్గురు తెలుగు హీరోలు.. నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టేందుకు మంది ముహూర్తం కోసం వెతుకుతున్నారు. తేదీల మీద తేదీలు మార్చి. అంకెల మీద అంకెలు లెక్కలేసి ఎట్టకేలకు సినిమా మొదలుపెట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మరి ఆ హీరోలెవరు..? కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు..?

2018 డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా.. త్రివిక్రమ్ తో సినిమాని అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. కానీ మూడు నెలలు గడుస్తున్నా..ఇంకా సినిమా మొదలుపెట్టలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడంతో పాటు మంచి రోజు కోసం బన్నీ ఇన్నిరోజులు వెయిట్ చేశాడు. అయితే ఎట్టకేలకు స్టైలీష్ స్టార్ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే రోజే సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అంతేకాదు.. ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకి సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. 

హ్యాట్రిక్ ప్లాపుల్ని ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో అఖిల్ కూడా తన నెక్స్ట్ మూవీని ఏప్రిల్ లోనే స్టార్ చేయనున్నాడు. ఏప్రిల్ 9న అఖిల్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో సినిమా మొదలవ్వనుంది. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ప్లాపులతో డీలాపడిపోయిన మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఏప్రిల్ లో మరో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఏప్రిల్ 6న సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది. ఈ మూవీని కూడా గీతా ఆర్ట్సే నిర్మిస్తోంది.
 
ఇక రోబో, పెటా సినిమాలతో స్పీడ్ మీదున్న.. సూపర్ స్టార్ రజినీకాంత్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం ఏప్రిల్ 10న ముంబాయిలో జరగనుంది. ఇలా హీరోలంతా కొత్త ప్రాజెక్టుల కోసం ఏప్రిల్ నెలలో ముహూర్తం చూసుకున్నారు.